షాడోలు (క్రీనీడలు ); ఎం. వి. ఉమాదేవి
శ్రావణ మాసము 
మహిళా మోదము 
నోముల రూపము 
వరలక్ష్మి వ్రతముతో  ఉమా!

పసుపు కుంకుమలు 
శనగ వాయినలు 
పూలూ ఫలములు 
పేరంటాళ్ల సందడి ఉమా!

గుప్పెడు శనగలు 
గుండెను ప్రేమలు 
చక్కని ఊసులు 
చిక్కని తెలుగమ్మాయిలుమా!

పట్టు పరికిణీ 
కట్టును  ఓణీ 
పూలను వేణీ 
గోరింటాకులు పండె  ఉమా!

కళకళయ్యింది 
వెళ్లి పోయింది 
అప్పగించింది 
భాద్రపదమునే మనకు ఉమా!

పందిరి సందడి 
పిల్లలు అలజడి 
శుభ  వినాయకుడి 
రాకకు స్వాగతమంత ఉమా!

రికార్డు మోతలు 
పంతులు పూజలు 
వంతులు బాలలు 
ప్రసాదాలకే ఆశ ఉమా!

రాత్రి నాటకము 
సూత్ర పూరితము 
రసా  ప్లావితము 
హరిశ్చంద్రలో పద్యముమా!

వరి నాటగాను 
రైతుల శ్రమలను 
 నాటక కళలను 
ఆనందంతో చూడు నుమా!

చిలకాకు పచ్చ 
మోహనము మెచ్చ 
పిట్టలతొ రచ్చ 
పొలములు శోభితమయ్యె ఉమా!

కోలాట మాడిరి 
కుడుములు ఇచ్చిరి 
ఉట్టిని కొట్టిరి 
పాట కచేరీ కూడ ఉమా!

గతములు ఘనములు 
హితమగు శ్రోతలు 
మితిగలవి పనులు 
సమాజమంతా కలిసి ఉమా!!

కామెంట్‌లు