నాన్న!!?-ప్రతాప్ కౌటిళ్యా
మనకోసం
తన ప్రపంచాన్ని వదులుకొని
ప్రపంచాన్ని పంచి ఇచ్చిన నాన్న
ప్రపంచమంత గొప్పవాడు!!!

మన వెనుక మనల్ని కాపాడడానికి
ఒక యమునిలా నిలబడ్డ నాన్న
అందరి గుండెల్లో ఒక గుండాల
ఉండడానికి కూడా ఇష్టపడ్డ నాన్న
ఎంతటి గొప్పవాడో
దేవుడిని అడిగి తెలుసుకోవాలి!!!?

నిండు కుండలా తొలకని
ప్రేమను అమ్మకిచ్చి
ధైర్యాన్ని దైన్యాన్ని తనకిచ్చుకొని
ప్రేమంటే నిన్ను కన్నా అమ్మేనని
చెప్పకనే చెప్పిన
కన్నతండ్రి కన్నా కన్నయ్య ఎవరుంటారు!!?

కుటుంబం నడవడం కోసం
కన్న పిల్లలకు నడక నేర్పడం కోసం
తన నడకనే నాట్యంగా మార్చుకున్న
పరమేశ్వరుడు నాన్న!!?

తను కన్నీళ్లు తాగి
పిల్లల కోసం తన కళ్ళు ఇల్లుగా మార్చిన
చల్లని చంద్రుడు నాన్న!!?

తనకోసం పనిచేసే మనుషుల్ని చూశాం
కానీ కన్న పిల్లల కోసం
పగలు రాత్రి పని చేసే పనిమనిషి
మన నాన్నా!!!

పిల్లల కోసం బిక్షమెత్తిన
బిచ్చగాడు ఏ దేవుడి అవతారము కానీ
పిల్లలకు వరాలు ఇచ్చిన దేవుడు నాన్న!!?

అమ్మ లేకుంటే అమావాస్యే
కానీ
నాన్న లేకుంటే ఆశే  లేదు!!?

మనం ఎంత ఎత్తుకు ఎదిగిన
ఇంకా ఎదగడానికి
అంత ఎత్తు నుంచి కిందికి దిగడానికి
ఒక నిచ్చెన లాంటివాడు నాన్న!!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు