ముగ్గులు ;- ఎం. వి. ఉమాదేవి
బాల పంచపది 
============
ముంగిటి వేసిన ముగ్గులు చూడు 
రంగులు అద్దే రమణిని చూడు 
చుక్కలు కలిపే నిపుణత చూడు 
పువ్వులు నేలకు పూచెను చూడు 
వాకిలి శోభను పెంచేచూడు.. ఉమ !

జంతువులన్ని కొలువులే చూడు 
పిట్టలు చెట్లు ముగ్గున కూడు 
ముగ్గులు వేస్తే బద్ధకం వీడు 
పోటీలోను  బహుమతి నుండు 
సంస్కృతి బాటలు చూడు.. ఉమ !

కామెంట్‌లు