ఓపొద్దు పొడిచింది
ఓపువ్వు పూచింది
నాకంట పడింది
నామనసు మురిసింది
ఆపువ్వు పిలిచింది
ఓనవ్వు నవ్వింది
ఊసులును చెప్పింది
ఉత్సాహము నిచ్చింది
మధ్యహ్నమయ్యింది
పువ్వువిచ్చుకుంది
పరువాలుచూపింది
ముచ్చటాపరచింది
పొంకమూ చూపింది
పరవశము నిచ్చింది
రంగునూ చూపింది
రంజింప జేసింది
పరిమళం చల్లింది
తేనెచుక్కలు విసిరింది
నోటిని తీపిజేసింది
మనసును దోచింది
సాయంత్రమయ్యింది
ఒరిగిపోయింది
వాడిపోయింది
నేలరాలింది
నాకు బాధకలిగింది
రాలినా బుజ్జగించింది
ఒకరాత్రికి ఆగమంది
రేపు మరలావస్తానంది
కవిత పుట్టకొచ్చింది
కాగితంపైకి ఎక్కింది
పలువురికి చేరింది
మనసులను తట్టింది
పూలు ప్రేమకుప్రతీకలు
పూవులు సున్నితమనస్కులు
ప్రకృతికి ప్రతిబింబాలు
పరికించువారికి ప్రియనేస్తాలు
పూలమొక్కలను
పెంచుదాము
పూలసహవాసమును
చేద్దాము
పూలకు
స్వాగతం పలుకుదాం
పూలకు
జైజైలు చెబుదాం
===================
జానకి పూలకవితవ్రాసింది
సాహితి చదివిమెచ్చుకుంది
పద్మజమది పులకరించింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి