సుప్రభాత కవిత ; -బృంద
నీటిలో దాగి నిగ్గు తేలి
రంగు రంగు రాళ్ళు
బంగరువెలుగుల్లో పొదిగి
రత్నాల హారంగా మలచి
సముద్రుడు  తీరానికి 
బహుమతిని

ముచ్చటగా తాకి తాకి
చూస్తున్న  అలల స్పర్శకు
మురిసి ముక్కలవుతున్న
నేలతల్లి.

తమకు నీలం మాత్రమే
ఇచ్చి ఇన్ని రంగులు 
దాచిన  కడలిని
సంబరంగా చూస్తున్న అంబరం.

ప్రకృతి లో అణువణువూ
బంగరు వెలుగులు నింపి
పచ్చని సొగసులు అద్దే

భానుని ఆగమనం...
లోకానికి శుభదాయకం

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు