భారత దేశం నా జన్మ భూమి
వేదాలను వెలికి తీసిన వేదభూమి
ఇతిహాసాలకు జన్మభూమి
కైలాస పర్వతమే మకుటంగా గల
దైవ భూమి
సృష్టి మొదలైనప్పటి సనాతన
ధర్మ భూమి
వైజ్ఞానిక సిధ్ధాంతాలకు అందని
విజ్ఞాన భూమి
ఎందరో మహాయోగులకు జన్మనిచ్చిన
యోగభూమి.
వివిధ భాషలతో వివిధ సంస్కృతలతో
అలరారే దివ్య భూమి
దోపిడీలకు గురైనా ధైర్యంగా నిలిచిన
కర్మభూమి.
విలక్షణ సంగీతాలు పుట్టిన రాగభూమి
ప్రకృతిని దైవంగా భావించే పవిత్రభూమి
యోగాసనాలను యావత్ప్రపంచమూ
ఆచరించేలా చేసిన యోగభూమి.
ఆయుర్వేదం తో ఆరోగ్యం ఇచ్చే
స్వస్థ భూమి
ఆహారం ప్రత్యేకం
ఆహార్యం పవిత్రం
అన్నివిధాల అత్యంత అతిశయం
నా జన్మ భూమి...నా భరతభూమి
ప్రకృతి లోనే పతాకం ఇమిడిన
పవిత్రభూమి
వందే మాతరం🙏🙏
ఎప్పటికీ.. మేరా భారత్ మహాన్
జై హింద్...🇮🇳...జై శ్రీ రామ్🙏
అమృతోత్సవ స్వాతంత్ర్య దినోత్సవ
శుభాకాంక్షలతో
శుభోదయం కోరుతూ
🌹🌹సుప్రభాతం🌹🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి