కష్టమైనా... సుఖమైనా...
గెలిచినా... ఓడినా...
కడదాకా బ్రతకాల్సిందే... !
ఈజన్మవచ్చింది...పూర్వకర్మఫలాలననుభవించటానికేనోయ్!
అది ఆనందమైనా.. బాధైనా
నిస్సేశంగా అనుభవించేస్తేనే
ఈ విషయాన్ని నీవర్దం చేసు కుంటేనే... చెడును పూర్తిగా వీడి, మంచిగా జీవిస్తేనే...నీకు
ఆనందమయమైన మరోజన్మ
అనుకున్నదిసాధించలేకపోయా
ననో,పరాజయాలు అవమానా లు పడాల్సొస్తుందనో... ఆత్మ హత్యతో తప్పించుకోవాలను కుంటే... పొరపాతేనోయ్... !
ఏం చేసినా అవి తప్పేవి కావు
కేవలం అనుభవించేస్తే తప్ప !
ఆ వృద్ధురాలిని చూడు....
ఆ వయసులోనూ.. సమస్యల కెదురునిలిచిఎలాసాగిపోతోందో
ప్రమాద ప్రతికూల పరిస్థితినీ తన కనుకూలంగా మలచుకునే ప్రయత్నం..... ! ఆహా... !!
రైలు పట్టాలెప్పుడూ కలవవు
గానీ అందరినీ గమ్యాలకు చేర్చి
కలుపుతాయి... !
కోరుకున్నవన్నీ యే ఒక్కరికీ కుదరవు... ఐనా కడదాకా పోరాడిజీవితంలోనిలవాల్సిందే
అదికదా పౌరుషం... !
అదే పురుష లక్షణమోయ్ !!
"పురుష" అంటే... కేవలం మగ వారే అనుకునేవు ! పురుష శబ్దానికి లింగభేదం లేదోయ్...
నిజ పౌరుషం ఎవరికుంటే వారే పురుషులు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి