ఓ కుర్రాడి దగ్గరున్న ఓ పెన్సిల్ బాక్సులో రాసి రాసి తరిగిపోయిన పెన్సిల్ కొత్త పెన్సిలుకి స్వాగతం పలికింది. నాకు అనుభవంలో తెలిసిన విషయాలు కొన్ని నీకు చెప్పబోతున్నాను. విను అంటూ తరిగిపోయిన చెప్పడం మొదలుపెట్టింది....
మొదటిది, నువ్వు నువ్వుగా పని చేయవు. నిన్నొకరు చేతిలోకి తీసుకుంటేనే పని చేయడం సాధ్యం.
రెండు, నీలో బయటున్న చెక్క భాగం కన్నా లోపలున్న లెడ్ lead భాగమే ప్రధానమైంది.
మూడవది, నిన్ను అప్పుడప్పుడూ చెక్కుతుంటారు. లెడ్ ఎప్పుడల్లా అరిగిపోతుంటుందో అప్పుడల్లా నిన్ను బ్లేడుతోనో షార్ప్ నర్ తోనో చెక్కుతారు. అటువంటి సమయంలో నువ్వు బాధను భరించేందుకు సిద్ధపడాలి.
నాలుగోది, ఎంతో ముఖ్యమైనది...నిన్ను రాయడానికి తీసుకున్న చేయి తప్పులు రాసినప్పుడు రబ్బరుతో ఆ తప్పుల్ని చెరుపుతారు. మళ్ళీ సరిగ్గా రాస్తారు.
తరిగిపోయిన పెన్సిల్ చెప్పిన విషయాలు ఏదో కొత్త పెన్సిలుకి చెప్పిన మాటలనుకోకూడదు. మనిషికీ చేసిన సూచనలుగా గ్రహించాలి. కానీ ఈ జీవిత పాఠాలను మరచిపోవడంవల్లే అప్పుడప్పుడూ కష్టాలను ఎదుర్కోలేక ప్రశాంతతను కోల్పోతుంటాం.
మొదటగా, నీ అంతట నువ్వు రాయలేవు. ఒకరు నిన్ను చేతిలోకి తీసుకోవాలి. అతనెవరంటే పరమాత్మ. అతనే మనల్ని భరిస్తాడు. మనల్ని చేతిలోకి తీసుకుని రాస్తాడు. నడిపిస్తాడు. అతని రాత దారి తప్పదు అనే నమ్మకముండాలి. ఆ పరంధాముడి చేతిలో నేనొక ఆయుధం అనేది మరచిపోకూడదు.
భగవద్గీతలో పదకొండో అధ్యాయంలో ముప్పై మూడో శ్లోకంలో కృష్ణభగవానుడు అర్జునుడితో చెప్పాడు...
"నిమిత్తమాత్రం" అని!
"ఎదురుగా ఉన్నవారందరూ నేలకూలిన వారందరూ నావల్ల ఎప్పుడో కూలినవారే. నువ్వు నా చర్యకు ఓ పరికరానివంతే" అని!
హస్తినాపురం ధర్మంతో పాలింపబడాలని నేను నిర్ణయించానని తెలుసుకో.
కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత అర్జునుడు చెప్పాడట...
"యుద్ధంలో నేను ఎక్కువ మందిని నేలకూల్చానని"
అయితే భీముడు "నీకన్నా నేనే ఎక్కువమందిని కూల్చాను" అంటిడు.
అప్పుడు భీమార్జునులిద్దరినీ కృష్ణుడు కురుక్షేత్రానికి తీసుకుపోతాడు.
అక్కడ బర్బరీకుడిని చూసి "అర్జునుడి బాణాలను చూసేవా? భీముడి గదను చూసేవా" అని అడిగాడు కృష్ణుడు.
బర్బరీకుడు "కురుక్షేత్రంలో నాలుగుదిక్కులా కృష్ణుడి చక్రాన్నే చూసా"నన్నాడు.
ఇంతకూ ఈ బర్బరీకుడు ఎవరంటే ఘటోత్కచుని కుమారుడు.
ఘటోత్కచుడు పాండవులలో ఒకడైన భీముడి పుత్రుడు. పాండవుల వనవాస కాలంలో రాక్షస కన్య అయిన హిడింబి భీముని చూసి మోహించి తనను పెళ్ళాడమని ప్రార్థిస్తుంది. కుంతీ ధర్మరాజాదులు హిడింబి, భీమసేనుల పెళ్ళి జరిపిస్తారు. వారి కుమారుడే ఘటోత్కచుడు. ఘటోత్కచుడు, మౌర్విల కుమారుడు బర్బరీకుడు. ఇతను చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో విశేష ప్రతిభకనబరచినవాడు. అస్త్రశస్త్రాల మీద అతనికి పట్టున్న వాడు.
కురుక్షేత్రంలో కృష్ణుడు "బర్బరీకా! నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే. కానీ నువ్వు ఏ పక్షానికైతే నీ సాయాన్ని అందిస్తావో ఆ క్షణానే ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది! నువ్వు పాండవులు, కౌరవుల పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు తెలుసా!" అంటాడు.
కృష్ణుడి మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతో ‘ఇంతకీ నీకేం కావాలో అడుగు!’ అంటాడు.
అంతట కృష్ణుడు, ‘మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావల్సి ఉంది. నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వాలని నా కోరిక" అని అడుగుతాడు.
ఇలా అడుగుతున్నది సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అని అర్థమైపోయిన బర్బరీకుడు మరో మాట మాటాడక తన తలను బలివ్వడానికి సిద్ధపడతాడు.
అయితే తనకు కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని ఎంతో ఆశగా ఉందనీ, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు బర్బరీకుడు. అలా బర్బరీకుడి తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది.
మన జీవితమూ అంతే. నేనూ, నాది అనే మాటల్ని చెరిపేసేసి నువ్వు, నీది అంటూ కృష్ణుడి పాదాలకు శరణు అని అనుకుంటే కలిగే ఆనందం అనంతం.
రామనామము, శివనామము ఇందుకే ఉన్నాయి. మనల్ని మనమే జ్ఞాపకం చేసుకోవడానికి.
మన కష్టసుఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు, మానావమానాలు అన్నీనూ అతని వల్ల జరిగేవే.
అలాగైతే వీటిలో నా పాత్ర ఏమిటనే ప్రశ్న వేయొచ్చు.
అప్పుడు నేను దాసుడిని...అతను స్వామి అని గ్రహించడమే మన పాత్ర. నేననే అహంకారం లేనప్పుడు మనం అణకువతో ఉంటాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి