కాకి కోకిల;-సత్యవాణి
 కాకి ఒకటి చెట్టుపైన
కాపురమ్ము వుండెను
ఏరితెచ్చి పుల్లపుడక గూడుకట్టె చక్కగా
ప్రక్కనున్నచెట్టుపైన
పికముఒకటివచ్చి వ్రాలె
కుహుకుహులపాటలతో
కాలమంత గడుపుచుండె
పలకరించె కాకి తనని
పలుమారులు ప్రేమతోడ
కట్టుకొనుము కోకిలమ్మ
కర్రపుల్లలు తెచ్చిగూడు
నేనుకూడ సాయపడుదు
నేస్తముగా నీకు నేను
ఈసడించె కోకిలమ్మ
ఎకసక్కెములాడె తనతో
బొంగురు గొంతుక నీది
భరించగా వీలుకాదు
నీతో స్నేహం చేయను
నాతో మాట్లాడవలదు
నాదుజోలినీకు ఏల
నాదుమంచి నాకుతెలుసు
అని కాకిని కసురుకొనెను
గ్రుడ్లుపెట్టు సమయమాయె
గూడుచేరెకాకమ్మ
గుట్టుగ గ్రుడ్లను పెట్టె
చక్కగ కూర్చొని గుడ్లపై
ఎంచక్కగ పొడుగుచుండె
కోకిలమ్మ గ్రుడ్లు పెట్ట
గూడే కరువాయెతనకి
చేయునదీ ఏమిలేక
చేరెను కాకమ్మచెంత
కాకమ్మా గ్రుడ్లపెట్ట
కాసింతగ చోటుయిమ్ము
అనికాకిని దీనముగా
అడిగెను కోకిల తాను
ఆదరమున కాకమ్మ
అట్లేరమ్మని పిలచె
కాకిగూటిలోచేరి
కోకిలమ్మ పెట్టెగ్రుడ్లు
పొదుగుట నేరను నేను
పొదిపెట్టు నాగ్రుడ్లను
అనివేడెను కాకమ్మను
అట్లే అనియెనుకాకి
తనదు గ్రుడ్లతోపాటుగ
తక్కిన గ్రుడ్లను పొదిగె
సంతసించె కోకిలమ్మ
తప్పుగాను మాట్లాడితి
తక్కువజేసితి నిన్నని
క్షమింయిపుము అనివేడెను
కాకి పెద్దమనసుగలిగి 
కౌగలించె కోకిలను
మనమికపై మిత్రులమై
మనుగడసాగించుదాము 
అనెనుకాకి కోకిలతో
ఆనందించెనుకోయిల
              

కామెంట్‌లు