పెరుగుట....విరుగుట
******
పెరుగుట... విరుగుట... ఈ రెండు పదాలను పెద్దలు తరచూ ఉపయోగిస్తూ ఉంటారు.
గర్వం తలకెక్కిన వాళ్ళనో , స్వార్థబుద్ధితో ఇతరులను ఎదగనీయని వారినో గమనించినప్పుడు... "పెరుగుట విరుగుట కోరకేనని",అలా చేయకూడదని, హిత బోధ చేయడం చూస్తుంటాం.
మనిషికి చదువూ,సంపదా, హోదా ఏది పెరిగినా అది అసలైన విలువల వ్యక్తిత్వాన్ని దిగజార్చుకో కూడదు. సంస్కారాన్ని పోగొట్టుకునేలా ఉండకూడదు.
ఈరోజున మనిషి మేధస్సు అపారంగా పెరిగింది కానీ, పక్కవారిని ఓర్చలేని తనం ఎక్కువైంది. పరోపకార చింతన కనుమరుగైంది.
మనల్ని చూసి నలుగురూ పెదవి విరిచేలా కాకుండా పెదవులపై చిరునవ్వు విరిసేలా ఉండాలి.
అప్పుడే పెరుగుట పట్ల సంశయాలు తరిగి సంతోషాలు కలుగుతాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి