నిదరోయిన నీటికి
నులివెచ్చని మేలుకొలుపు
స్తబ్దమై నిలిచిన
గిరిశిఖరాలకు కనకపు తొడుగు
ముచ్చటైన రంగులు
ఒంటిపై చూసుకుని
మురిసిపోతున్న
మేఘమాలలు
నారింజరంగు చీర
కట్టుకుని సంబరపడుతున్న
అంబరం.
వెలుగురేకలు విచ్చుకుంటూ
మింటి మీద విహారానికి
సిద్దమవుతున్న పసిడి పుష్పం
గగనంలో జరిగే అద్భుతాన్ని
కన్నులార వీక్షించు ఇలాతలం
అణువణువూ పులకరింప
అనుగ్రహ కిరణాల స్పర్శకై
ఎదురు చూచు సమస్త జగతి
కనులవిందైన కమనీయ దృశ్యం
గగనపు యవనికపై వెలిసిన చిత్రం
అందరికీ సమానంగా అందే
మార్తాండుని అపార కరుణా వీక్షణం
మంగళకరమైన ఉదయానికి
మనస్ఫూర్తిగా మనసు పలికె
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి