భాష ఇంజనీరింగ్!!!- ప్రతాప్ కౌటిళ్యా
 మనుషుల భాష మనుషులకే అర్థం కావటం లేదు. కానీ జంతువుల భాష మనిషికి అర్థమవుతుంది. భాషకు పునాది శబ్దం మరియు విజన్. దాని ద్వారానే భాష పుట్టింది. కానీ భాషను మనం పంచేంద్రియాల పరస్పర సహకారంవల్ల కమ్యూనికేట్ అయి అనుభూతి చెందుతాం.
అనుభూతికి భాషకు మధ్య సంబంధమే సాంకేతిక అక్షర రూపమే భాష ఇంజనీరింగ్.
భాషా ఇంజనీరింగ్ భావాలకు అనుభూతులకు మరియు చక్కని కమ్యూనికేషన్ కు వారధి లాంటిది. భాష ఇంజనీరింగ్ సాంప్రదాయక అంశాలైన విజన్ శబ్దం పునాదులపై నిర్మించబడింది. కానీ రాను రాను అనుభూతులను అనుభవాలను భావనలను 100% కమ్యూనికేట్ చేయడానికి భాష ఇంజనీరింగ్ ముందుకు సాగలేక పోతుంది. ఉదాహరణగా మనం మన మాతృభాషనే సరిగా ఉపయోగించకపోవడం మరియు మాతృభాషేతర భాషలను మాతృభాష ద్వారా సరిగా నేర్చుకోలేకపోవడం అడ్డుగా మారింది. అంటే మాతృభాష ద్వారా మరే భాషలైన ఎన్నైనా నేర్చుకోవచ్చు. కానీ అలా సాధ్యం కాకపోవడం విచారకరం. మన భాషలను మనమే సరిగా అర్థం చేసుకోలేక పోతున్నాం. మూల కారణం అతి పాత అతి పురాతన భాష ఇంజనీరింగ్ విధానమే కారణం. మాతృభాషను మరియు ఇతర భాషలను మాతృభాష ద్వారా కానీ మరి ఇతర భాషల ద్వారా కానీ నేర్చుకోలేకపోతున్నామంటే ఖచ్చితంగా ఇది భాషా ఇంజనీరింగ్ లోపమేనని మనకు అర్థమవుతుంది.
విజన్ శబ్దం ద్వారా కాకుండా స్పర్శ ద్వారా నేర్చుకున్న భాషకు ఆ భాషా సాంకేతికత అత్యాధునికమైనదిగా భావించాల్సి వస్తుంది. అంటే అత్యధిక సాంకేతికత కలిగిన డిజిటల్ కమ్యూనికేషన్ లాగా భాషా సాంకేతికత 🌅 అపురూపమై కమ్యూనికేషన్ కు సరైన సాంకేతిక భాషగా భావించాల్సి వస్తుంది. ఇదే విచిత్రం జంతువుల భాషను మనం సాధారణంగా అర్థం చేసుకుంటాం. కానీ దానికన్నా మనం మన భాషలను అర్థం చేసుకోలేకపోతున్నాం. మౌనం భాషలో ఇంజనీరింగ్ లోపమేననీ అంగీకరించాల్సి వస్తుంది. అలాగే మూగ చెవిటి వారి కమ్యూనికేషన్ నూటికి నూరు శాతం జంతువుల భాష లాగా అర్థం చేసుకుంటున్నాం. అంటే ఇది కూడా సాంప్రదాయక భాష ఇంజనీరింగ్ లాగా కాకుండా అత్యాధునిక సాంకేతిక భాషగా మనం భావించాల్సి వస్తుంది. ఇక్కడ మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. శబ్దం విజన్ పునాదులపై నిర్మించబడ్డ భాషల ఇంజనీరింగ్ అతి పురాతనమైనదని దాన్ని మనం రాతపూర్వకంగా అక్షర రూపంలో కానీ శబ్దం రూపంలో కానీ సృష్టించుకున్న భాష ఇంజనీరింగ్ లోపం ఉందని తెలుస్తుంది. లేకుంటే గుడ్డి వారి కోసం మూగ చవితి వారి కోసం నిర్మించుకున్న భాష ఇంజనీరింగ్ కొంత అత్యాధునికమైనదిగా అంగీకరించక తప్పదు.
భాషా శాస్త్రవేత్తలు భాషలను నేర్పించే క్రమంలో ఈ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అది కేవలం భూమ్మీద ఉన్న అన్ని భాషల భాష ఇంజనీరింగ్ లోపమేనని మనము ఒప్పుకొని తీరాల్సిందే, చివరగా భాష ఇంజనీరింగ్ భాషా శాస్త్రీయ విధానం శాస్త్రీయంగా లేదు అని మనం అంగీకరించాల్సి వస్తుంది.
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు