'కనీస సామర్ధ్యాల సాధనకు కృషి చేయాలి'; - ఎఫ్ఎల్ఎన్ కోర్స్ కోఆర్డినేటర్ వై. రమేష్

 తరగతి, సబ్జెక్టు వారిగా పిల్లల్లో కనీస సామర్థ్యాల సాధనకు ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసి(తొలి మెట్టు) ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం కోర్స్ కోఆర్డినేటర్ యర్రా రమేష్ కోరారు. శనివారం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని హైస్కూల్లో గత ఆరు రోజులుగా మండలంలోని ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులకు జరుగుతున్న వృత్యంతర శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కృత్యాధార, వినూత్న బోధన పద్ధతులను ఉపయోగించి పిల్లల్లోని అంతర్గత శక్తులను వెలికి తీసి, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిక్షిప్తమై ఉందని, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం కార్యక్రమ పరిశీలకులు సుదర్శనం మాట్లాడుతూ కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్పీలు ఈర్ల సమ్మయ్య, కె.స్వప్న, గుంటి వేణుగోపాల్, కె. దేవేందర్, సి.ఆర్.పి కుంట కుమారస్వామి, మండలంలోని ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు