అక్షరాల సోయగాలు;-మిట్ఠపల్లి పరశురాములు సిద్దిపేట
అక్షరమేఆయుదముర
అక్షరముగమారెసిరా
లక్షమెదళ్ళకుకదలికై
లక్షణముగనునిలచెరా

కవనపూలతోటలోన
కదిలించుమదిఎదలోన
కదిలిపోయెనుగనాకలం
అక్షరపూబాటలోన

పేదవానిగుండెలోన
పేగుబంధమైనిలచిన
కవితపూలహారముగను
వెలిగిపోయెదివ్వెగాను

అమ్మగోరుముద్ద తీరు
పరుగులమ్మగసెలయేరు
కవితపూలతోటలోన
జాబిలమ్మపాటతీరు

వెన్నెలమ్మవెలుగువిధము
కన్నెపిల్లమోమువిధము
కవనకాంతవెలుగుచుండు
కోటికవులమేటిసమము

ఇంటివెలుగుకాంతయగును
కంటిపాపకాపలగును
బంధములనుకలుపుకవిత
కోవెలందుదీపమగును

బోసిపాపనవ్వుజూడు
వెన్నెలారబోసెనేడు
అక్షరాలకాంతులతో
కట్టెకవితప్రేమగూడు

          *

( ప్రపంచ కవితాదినోత్సవసందర్భముగ వ్రాసినకవిత) 21-08-2022

కామెంట్‌లు