పురాణ బేతాళ కథ.;డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు సత్యహరిశ్చంద్రుని గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
'బేతాళాసూర్యవంశంలోవైవస్వతుడు,ఇక్షావాకుడు,కుక్షి,వికుక్షి,బాణుడు,యవ్వనాశ్వుడు,మాంధాత,పురుకుత్సుడు,త్రసధన్యుడు,అనరణ్యుడు,త్రిశంకుడు,తరువావ సూర్యవంశ పాలకుడిగా హరిశ్చంద్రడుఉన్నాడు.ఇతని సత్యవాక్కు ,పరిపాలనాదీక్షత,కీర్తి, ముల్లోకలకు వ్యాపించింది.విశ్వామిత్రమహర్షి హరిశ్చంద్రుని సత్యనిష్ఠ పరిక్షించాలని
సభాముఖంగా యాగానికి ధనసహాయం చేయాలనికోరాడు."మహభాగ్యం తమవంటితపోధనులకుసేవచేయటంనాభాగ్యంఎంతకావాలన్నతీసుకువెళ్ళండి"అన్నాడు హరిశ్చంద్రుడు."అలాగే అవసరంఅయినప్పుడు తీసుకుంటాను" అని వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు.ఒకరోజు వేటకైవెళ్ళి అరణ్యంలో విడిదిచేసిన హరిశ్చంద్రుని తనుసృష్టించిన"మాతంగకన్యలను"వివాహంచేసుకొమన్నాడు విశ్వామిత్రుడు" ".నేనుమరోవివాహం చేసుకోలేను."రాజర్షి నారాజ్యానైనా వదులుకుంటాకాని "అన్నడుహరిశ్చంద్రుడు. "అలాగా సరే నీరాజ్యాన్ని నాకు ధారపోయి"అనిరాజ్యంపొంది."ఇకనీవుభార్యాబిడ్డలతోరాజ్యంవిడచివెళ్ళుఅని"ఆజ్ఞాపించాడు.విశ్వామిత్రుడు.తనభార్యచంద్రమతి,కుమారుడు లోహితాస్యునితో కట్టుబట్టలతో రాజ్యంవదలివెళ్ళబోతున్న హరిశ్చంద్రుని "రాజా యాగార్దం నువ్వు నాకు యిస్తానుఅన్నధనం యిచ్చివెళ్ళు"అనినిలదీసాడు విశ్వామిత్రుడు."రాజర్షి ఒకమాసంగడువు యివ్వండి మీమనిషిని ఎవరినైనా నావెంటపంపండి గడువులో చెల్లిస్తాను"అన్నాడు హరిశ్చంద్రుడు.తనశిష్యుడు అయిన "నక్షత్రకుని హరిశ్చంద్రుని వెంటపంపాడు విశ్వామిత్రుడు.అలాఅరణ్యమార్గానవెళుతూ రాత్రి ఒచెట్టునుకిందఆగారు, అదేచెట్టును ఆశ్రయించుకునిఉన్న బేతాళుడు హరిశ్చంద్రునితొతలపడిమరణించాడు.అలావారణాసిచేరివిశ్వేశ్వరునిదర్మించి,అదేనగరంలో ఒవిప్రునికితన భార్యను అమ్మి వచ్చినధనం నక్షత్రకుని యిచ్చాడు హరిశ్చంద్రుడు."రాజా ఈధనం నాదారి కర్చులకేసరిపోతుంది యివ్వలేను అను నాదారిన నేనుపోతాను"అన్నాడు నక్షత్రకుడు."అయ్యనన్ను ఎవరికైనా అమ్మి మీగురువుగారిధనంతీసుకువెళ్ళు"అన్నాడుహరిశ్చంద్రుడు".వీరబాహువు"అనేకాటికాపరికి హరిశ్చంద్రుని అమ్మి వచ్చినధనం తీసుకుని వెళ్ళిపోయాడు నక్షత్రకుడు.హరిశ్చంద్రుడు కాటికాపరిగా ఉండసాగాడు.తనతల్లితో వెళ్ళిన లోహితుడు పాముకాటుతొ మరణించడంతో ,తనయజమానిభార్య "కాలకంటకి"అనుమతిపొంది కుమారునిశవంతో స్మశానం చేరి చితిపేర్చి దహనానికి సిధ్ధమౌతున్నసమయంలో కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు చీకటిలో తనభార్యను గుర్తించక కాటిసుంకం చెల్లించనిదే దహనం చేయరాదని అడ్డగించాడు."కడుపేద నిర్బాగ్యురాలను తనవద్ద ఎటువంటిధనం లేదు అనిసమాధానమిచ్చిన చంద్రమతికి "నీమెడలోనిమంగళసూత్రం అమ్మిచెల్లించు"అంటాడు హరిశ్చంద్రుడు."నాపతికితప్ప యితరులకునామాంగళ్యం కనిపించదు యిది వషిష్ఠమహర్షీ యిచ్చినవరం నామాంగళ్యంచూడగలిగావుఅంటే మీరుహరిశ్చంద్రచక్రవర్తేనాధా"అంటూభోరునవిలపిస్తుంది.ఆమెనుఒదార్చేసమయంలో రాజభటులు అక్కడికివచ్చి ఓయి ఈమె శిశు హంతకి మారాడక రాజఆజ్ఞా నెరవేర్చు ఈకత్తితో ఈమె శిరస్సు ఖండించు అన్నారు .దైవేచ్చ అనిచంద్రమతిని "వధ్యశిల"వద్దకుతీసుకువెళ్ళి కత్తిచేతపట్టి ఈశ్వరా అనిప్రార్ధించగా"హరిశ్చంద్రా నీసత్యసంధత అమోఘం,విధినిర్వాహణలో దారాసుతులు అన్నమమకారం ఉండరాదని ప్రపంచానికి చాటిచెప్పిన నీఘనత శాశ్వితం,నేటినుండి నువ్వుసత్యహరిశ్చంద్రుడిగా .నీబిడ్డబ్రతికేవున్నాడు.సత్యసంధతగురించి భూలోకంలో మొదటనీగురించేచెప్పుకుంటారు,సుఖసంతొషాలతో రాజ్యపాలనచేయి అని పార్వతి పరమేశ్వరులు,విశ్వామిత్రుడు ఆశీర్వదించారు.అనంతరం ముఫైఏడుతరాల సుర్యవంశీయులు పరిపాలనకొనసాగించారు.చివరిగా బృహద్బలుడు పాలించాడు.' విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
కామెంట్‌లు