అమ్మభాష;--సాహితీసింధు సరళగున్నాల
ఆ.వె*అమ్మ పలుకులోన నమృతమ్మును నిలిపి
మాటలాడనదియె మూటయగును
పరుల భాష పలుక  భావ లోపమ్ముయే
నిండుచుండు నండనుండబోదు

ఆ.వె*తేనెలొలుకు భాష తీయందనమ్ముయే
పలుకులోన తీపి పరుగులిడును
భాషలన్నినేర్వు భాషించు తెలుగులో
తెలుగుకన్న మిన్న వెలుగులేదు

మ.కో*వత్సరమ్మున కొక్కమారుగ
భాషనాడిన చాలదే
మత్సరమ్మును మానుచుండిక
మాటలాడుముతెల్గులో
తత్సరమ్మును జేయబోకుము
దండిగామన భాషకున్
తత్సమమ్ముగ లేదునేదియు
దండిగాడుము నాంధ్రమున్

కామెంట్‌లు