ఎండిన పేగులుఅంగలారుస్తున్నా..సమస్యల చెదలుమది తొలుస్తున్నా..కన్న పేగు ఆకలి కేకకుతల్లడిల్లే తల్లి విశాల హృదయం!నూతన లోకంలో అడుగిడిననవ జాత శిశువుకుఅమ్మ పాలు అమృతం!ఆప్యాయతల మేళవింపుఅనుబంధ సుగంధ పరిమళాలుతల్లి ముర్రుపాలు బిడ్డకు తొలి మురిపాలు!పలు జబ్బులతోపోరాడే పటిమ నిచ్చిచిన్నారుల సుఖీభవులుగాఆశీర్వదించే అమ్మపాలుఅపర సంజీవని!ఈ కల్తీల సమాజంలోఏ కల్తీ లేనివి అమ్మపాలేపరిశోధించాల్సింది లేదుపరిక్షించాల్సినవసరం రాదుఆరు నూరైనా ఆర్నెళ్ల పసిమొగ్గకుఅమ్మ పాలే సంపూర్ణాహారం!ఏ కాలమైనా రుతువేదైనాపగలైనా రాత్రయినాఅనుక్షణం అందుబాటులోఅమ్మ పాలే ఆలనా పాలనాఏటిఎమ్ అంటే 'ఎనీటైమ్ మిల్క్'గాపెరిగే శిశువుకి పోషకాల పసిడి హారం!తల్లి పాల ఉత్పత్తికిఫ్యాక్టరీల ప్రమేయం లేదుఖర్చులేని ఖరీదు కట్టలేనిచల్లని అమ్మ మనసు చాలుశిశువుకు కొండంత అండ!సీసా పాలొద్దు సెరీలాక్ బూస్ట్ ల దరి చేరొద్దుగర్భాశయ రొమ్ము క్యాన్సర్ భూతాన్నితరిమి తరిమి కొట్టే తల్లి పాలు!మాతా!మాతృత్వం ఓ వరంమాతృత్వం మధుర స్వప్నంఆస్వాదించు ఆనందించు!(1- 7 ఆగస్టు" తల్లిపాల వారోత్సవాల సందర్భంగా)
పోషకాల పసిడి హారం;-కవిరత్న నాశబోయిన నరసింహ(నాన),ఆరోగ్య పర్యవేక్షకుడు, NCVBDC సికింద్రాబాద్,8555010108
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి