*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0141)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సతీదేవి ప్రశ్న - శివ భగవానుని విజ్ఞానము, నవవిధ భక్తి వివరణ*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*శ్లోకం:- త్రైలోక్యే భక్తి సదృశః పంథా నాస్తి సుఖావహః | చతుర్యుగేషు దేవేశి కలౌ తు సువిశేషతః ||*
                        (శి.పు.రు.సం.స.ఖం.23 / 38)
*అంబా! భక్తి భావము అన్నిటికంటే గొప్పది. జ్ఞాన వైరాగ్యాలకు మూలము. ఈ భక్తిని ఎల్లప్పుడూ మనసులో వుంచుకునే వారు నాకు అత్యంత ఇష్టమైన వారు. ఈ భక్తి కి ముక్తి దాసి అవుతుంది. ఈశ్వరీ! మూడు లోకములలో, నాలుగు యుగములలో భక్తి మార్గము ఇచ్చే సుఖానికి సమానమైన సుఖాన్ని ఇచ్చే దారి వేరేది లేదు. ఈ భక్తి అనే భావము కలియుగంలో అన్ని సుఖ సంతోషాలను ఇస్తుంది. ఈ భక్తి ని మనసులో నిలుపున్న భక్తునకు నేను ఎల్లప్పుడూ కట్టుబడి వుంటాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు.*
*నా భక్తులకు కలిగే బాధలను, దుంఖాలను పోగొట్టడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటాను. నా భక్తులకు సర్వకాల సర్వావస్థలందు సహాయం చేస్తాను. నా వారైన భక్తులకు శత్రువులు వుంటే వారిని నిలువరిస్తాను. మునుపు నా భక్తుల కోసం, యముడు, సూర్యడు, నా పరమ భక్తడైన రావణునితో కూడా యద్ధం చేసి నిలువరించాను. నేను ఎల్లప్పుడూ భక్తాధీనుడను. నేను "భక్తవశంకరుడను". సతీ! దేవేశ్వరీ! ఇది నిక్కము. ఇదే నిక్కము.*
*శ్లోకం:- యో భక్తిమాన్పుమాంలోకే సదాహం తత్సహాయకృత్ | విఘ్నహర్తా రిపుస్తస్య దండ్యోనాత్ర చ సంశయః ||*
                                  (శి.పు.రు.సం.స.ఖం.23 / 41)
*నారదా! భక్తితో నిండిన భక్తుని ప్రభావం తెలుసుకున్న సతీదేవి ఎంతో ప్రసన్నురాలు అయ్యింది. ఉమ కోరిక మేరకు శివయ్య, ఇతిహాసములను, వర్ణాశ్రమ ధర్మాలు, వైద్యశాస్త్రం, జ్యోతిషశాస్త్రం వివరించారు. లోకోపకరమైన అనేక శాస్త్రాలను కూడా అంబ కు తెలియ పరిచారు, మనక తెలియడం కోసం.* 
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు