*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 045*
 'ఉత్పలమాల:*
*పాపము లొందువేళ రణ | పన్నగ భూత భయ జ్వరాదులం*
*దాపద నొందువేళ భర | తాగ్రజ మిమ్ము భజించువారికిన్*
*బ్రాపుగ నీవుఁదమ్ముడిరు | పక్కయలన్ జని తద్విపత్తి సం*
*తాపము మాన్పి కాతురట | దాశరధీ !కరుణాపయోనిధీ !.* 
*తా:*
దయకు సముద్రము వంటివాడవైన రామభద్రా!  భరతునికి అన్నవైన శ్రీరామా! నిన్న భజించి కీర్తించే వారికి, పాపములు చుట్టుముట్టి నప్పుడు, పాముల వల్ల, భూత ప్రేతముల వల్ల, శరీరమునకు కలిగే వివిధ బాధల నుండి, నీవు, నీ తమ్ముడు లక్షమణునితో కలసి వారికి చెరు పక్కల నిలబడి సహాయం చేసి వారికి కలిగిన బాధలను తప్పిస్తావని లోకులు చెప్పకుంటుంన్నారు....... అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"పక్కల నిలబడి కొలిచే ముచ్చట బాగా తెల్ప రాదా" అని త్యాగరాజు గారు కీర్తించారు రామయ్యను. సిరికి చెప్పకుండా, శంఖు చక్రాలు చేత పట్టకుండా, గరుత్మంతుని ఎక్కకుండా, పరివారంను వెంట తెచ్చు కోకుండా గజేంద్ర రక్షణకు కదిలాడు విష్ణుమూర్తి. రామభద్రుడు మాత్రం, తనవారైన భక్త మహాశయులను రక్షించడానికి, సీతా సౌమిత్రలను వెంట పెట్టుకుని మరీ వచ్చి ఆపదలనుండి కాపాడుతారు. పదునాలుగు సం.రాల వనవాసంలో ఎంతో మంది మౌనిపుంగవులను, జీవులను కాపాడారు కదా! గుహుని కూడా ఆతని కోరిక తీర్చి రక్షించాడు భక్తసులభుడు అయిన హనుమదైవం! అంతటి అనిర్వచనీయమైన అనుభూతిని మనకు కలిగించమని ఆ రామభద్రునే వేడుకుందాము .....*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు