*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 054*
 *ఉత్పలమాల:*
*దాసిన చుట్టమా శబరి | దాని దయామతి నేలినావు నీ*
*దాసుని దాసుఁడా గుహుఁడు | తావక దాస్య మొసంగినావు నే*
*జేసిన పాపమో ! వినుతి | చేసినగావవు గావుమయ్యా ! నీ*
*దాసులలోన నేనొకఁడ | దాశరధీ ! కరుణాపయోనిధీ !.* 
తా: దశరధుని పుత్రుడా! దయకు సముద్రము వంటి వాడా! బోయ స్త్రీ శబరి నీకు చుట్టము కాకపోయినా ఎంతో దయతో కాపాడావు. పడవ నడుపు కునే గుహుడు నీ సేవకులకు సేవకుడు కూడా కాడు. అయినా నీ పాదసేవ అతనికి అనుగ్రహించావు. మరి నేను ఏమి పాపము చేసాను స్వామీ! కరుణించి కాపాడమని వేడుకున్నా కూడా కాపాడకున్నావు. నేను కూడా నీ దాసులలో ఒకడిని, రామభద్రా!..... అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*తమని రక్షంచి కాపాడమని అడుగ కుండానే ఎంతో మందిని కాపాడి, కరుణాకరుడివి, దయాసముద్రానివి అని పేరు, కీర్తి సంపాదించుకున్నావు కదా, భక్తవత్సలా! నాకా త్యాగరాజు, అన్నమయ్య, రామదాసుల లాగా పాట రాయడం రాదు. పాడటం అంతకంటే రాదు. పోనీ నోరారా నిన్ను పిలుద్దాము అంటే ఆలోచనలు నీ దగ్గర నిలబడవు. అవసరానికి మించి చిత్తచాల్యం వున్న వాళ్ళము. ఇక మా అంతట మేము ఏమి చేయగలము. అందుకే నిన్ను మరవకుండా వుండడానికి, నీ పేరు తలచుకుంటూ వుండడానికి నీ సహాయం కోరుతున్నాము. ఇంతగా వేడుకుంటున్నాము. నీవే దక్క వేరెవరూ మమ్మల్ని కాపాడలేరు. పరమేశ్వర నీ కరుణ మాకు కావాలి. వచ్చి నీ చేయూత ఇవ్వు పరంధామా!....*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు