*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 062*
 *ఉత్పలమాల:*
*కోతికిశక్యమా యసుర - | కోటుల గెల్వను? గెల్చెఁబో నిజం*
*బాతని మేన శీతకరుఁ | డౌట దవానలుఁడెట్టివింత, మా*
*సీతపతివ్రతామహిమ - | సేవక భాగ్యము మీకటాక్షమున్*
*ధాతకు శక్యమా పొగడ | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: కరుణా నిధివైన! దశరధరామా!  కోతి మూకలకు, కోట్లకొలది రాక్షస వీరులను గెలవగలగటం సాధ్యమా! పోనీ గెలిచారు అనుకుందాము, కాసేపు. కోతి తోకకు నిప్పు అంటించితే, ఆ నిప్పు కోతికి వేడి పుట్టించాలిగానీ, చంద్రుని వెన్నెల చల్లదనం లాగా చల్లగా వుండటం ఏమిటి. మా సీతమ్మ తల్లి పాతివ్రత్య మహిమ, నీ సేవకులకు నీవు కలిగించే భాగ్యాన్ని పొగడటం విధాత అయిన బ్రహ్మ వల్ల కూడా కాదుకదా, భద్రగిరీశా!........అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*దశరధ రామా! నా తండ్రీ! నీ కరుణను, దయను, నీ ప్రాభవాన్ని, కీర్తించడానికి సనకసనందనాదులకు, బ్రహ్మ కు, విష్ణుమూర్తి కి సాధ్యం కానప్పుడు, నీ వల్లనే పుట్టి, నీ పెంపుతో పెరిగి, నీ వల్లనే కళ్యాణ వంతులమైన మేము, నీ కీర్తిని అర్థం చేసుకుని, తెలుసుకుని, కీర్తించడం జరిగేపనేనా! చంద్ర ధరా! పైగా మమ్మల్ని కమ్ముకుని వుండే నీ మాయ ప్రభావం, ఒకటి. నీ ప్రాభవాన్ని, నిన్ను, మేము తెలుసుకోవాలి అన్నా, నిన్ను కీర్తంచాలి అన్నా, మాకు నీ సహకారం ఎంతో అవసరం అని నికు తెలుసు కదా! పౌండరీక వరదా! ఇంకా ఆలస్యం, వాళ్ళే తెలుసుకుంటారులే అనే అలసత్వం ఎందుకు, స్వామీ మామీద. దయచేసి, గజరాజు రక్షణకు వచ్చినట్టు, వేగమె రావే నా కన్నతండ్రీ!........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు