సిద్దిపేట యువకవి "ఉండ్రాళ్లకు"అవార్డు

 బాల సాహిత్యానికి  చేసిన కృషికి గుర్తింపుగా సిద్దిపేట యువకవి, బాల సాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశంకు  లంబోదర కల్చర్ అకాడమీ ప్రతి సంవత్సరo ఇచ్చే" కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు_2022"కు ఎంపికయ్యారు. అవార్డును మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదులో ప్రదానం చేయనున్నారు. ఎంతోమంది వర్ధమాన కవులకు ఆదర్శంగా నిలిచిన, ఉండ్రాళ్ళ రాజేశం సిద్దిపేటలో బాల సాహిత్యం విస్తరించడానికి తన వంతు కృషి చేశారు. ఎన్నో కథలు, గేయాల పుస్తకాలను ప్రచురించి బాల సాహిత్యంలో తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్నారు. తను రచనలు చేస్తూ మరొకవైపు విద్యార్థుల చేత వివిధ ప్రక్రియలపై రచనకు ప్రోత్సాహం ఇస్తూ వారి ప్రతిభను వెలికి తీస్తున్నారు.ప్రముఖ తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు  ఉండ్రాళ్ళ రాజేశంకు రావడం సిద్దిపేట సాహిత్య అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలుగ జేసింది .
కామెంట్‌లు