గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి (13)-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
 శివ నాగ రెడ్డి గారి కన్నా  మించిన శిల్పులు ఉన్నా ప్రత్యేకించి వీరి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే  మహాశిల్పి జక్కన్న గాని గొప్ప చిత్రకారుడు రవివర్మ కానీ ఎవరైనా వారు నేర్చిన  విద్యల్లో నిష్ణాతులు వీరు అలా కాదు. సాహిత్య సారస్వతాలలో అపారమైన అనుభవం ఉంది శాసనాల ద్వారా చరిత్రను అధ్యయనం చేసిన వారు అతి తక్కువ మందిలో శివనాగిరెడ్డి గారు ప్రథమంలో నిలుస్తారు. వారి చరిత్రను చెప్పేటప్పుడు విసుగు పుట్టేది కాదు ఇంకా చెప్పితే బాగుండును అనిపిస్తుంది వివరించి విశ్లేషణ చేయగలిగిన  సత్తా కలిగిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అన్నిటిని గురించి మాట్లాడగలిగే శక్తి కొంతమందికే ఉంటుంది. స్వయంకృషితో, అంకితభావంతో చేసినవారు మాత్రమే ఆ కోవలోకివస్తారు రెడ్డి గారు అలాంటి విశిష్ట వ్యక్తి నేను ఆకాశవాణిలో పని చేయడం వల్ల ఇలాంటి మేధావులను కలిసే అదృష్టం తో పాటు గర్వంగా కూడా ఉంటుంది. సురవరం ప్రతాపరెడ్డి లాంటి వాళ్లు  అనేకమంది చరిత్రకారులు ఉన్నారు  వారు రాసిన రచనలు  గ్రాంధికంగా ఉంటాయి తప్ప  మామూలు భాషలో ఉండవు  కొన్ని పదాలకు అర్థం కూడా తెలియక పోవచ్చు. శివ నాగి రెడ్డి గారి రచన అలా కాదు  విషయ పరిజ్ఞానం కలిగి  భాష మీద పట్టు ఉండి కారు నడిపే  డ్రైవర్ చేతిలో స్టీరింగ్ ఎలా తిరుగుతుందో అక్షరాలన్నీ  ఈ రచయిత పట్టుకున్న కలానికి దాసోహం అంటాయి. బందా గారు చెబుతూ ఉంటారు ఎప్పుడూ. రేడియో నాటకాన్ని వినే వాడికి  కష్టమైన శబ్దాలు వినపడకూడదు. అర్థం తెలియని ఆ శబ్దాన్ని  శబ్దరత్నాకరం లో చూసి  తెలుసుకునే లోపు దృశ్యం 15 నిమిషాలు గడిచిపోతోంది. రెడ్డి గారి భావం కూడా ఇదే  చదివిన ప్రతి అక్షరం తిరిగి చదువుకోకుండా  ముందుకు పరిగెత్తుకుంటూ పోవాలి  చదివించే గుణం ఆ రచయితకు ఉన్నాయి. కనక ఇది రెడ్డి గారికే సాధ్యం. రెడ్డిగారికి కుల, మత, వర్గ, వర్ణ విభేదాలు తెలియవు  వారికి తెలిసిందల్లా మంచి చెడు  మంచి మనస్తత్వం కలవాడిని  దగ్గరకు తీస్తారు మంచి స్నేహితులవుతారు  అదే కుళ్ళు కుతంత్రాలతో ఉన్న వాళ్ళని చూస్తే దుష్టులకు దూరంగా ఉండాలని పెద్దలు చెప్పిన సూక్తి అనుసరిస్తూ ఆచరిస్తారు. వారికి అనేక పర్యాయాలు ఉద్యోగాలు ఇచ్చే  అవకాశం కలిగింది. ఎక్కడా కుల ప్రస్తావన తీసుకురాలేదు  అతని సామర్థ్యం, నడవడిక చూపిన వారినే ఎన్నిక చేస్తారు తప్ప మీ కులమా నా కులమా అని చూడరు. ఎన్నిక చేసే విధానం కూడా ఎవరి పేరు వారి దగ్గర ఉండదు. అందరికీ  అంకెలిస్తారు  అలాంటప్పుడు వారి పేరు కూడ తెలియడానికి అవకాశం ఉండదు. వారి కార్యక్రమాలన్ని  అంత ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణతో జరుగుతాయి అందుకే వారంటే మా అందరికీ ఇష్టం.


కామెంట్‌లు