గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (30);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.


 జీవితంలో  ఆదర్శంగా జీవించేవాడు లేకపోవచ్చు కానీ ఆశ లేనివాడు మాత్రం ఉండదు. తన ఆశయం కోసం ప్రయత్నం చేసి దానిని సాధించే వరకు  కృషి చేస్తే ఆ జన్మ చరితార్థం నాకు గోరా గారు (గోపరాజు రామచంద్రరావు గారు డాక్టర్ సమరం గారి తండ్రి) ఒక విషయం చెప్పారు  మనం  మురికి కాలువలు చూసినప్పుడు  దానిని శుభ్రం చేయడానికి దానిలో దిగాలి. తర్వాత శుభ్రం చేయాలి. మొత్తం శుభ్రం చేసిన తర్వాత తన శరీరానికి ఆ మురికి అంటుతుంది  దానిని కడిగి వేసుకుంటాం. ఇది ఆదర్శ వాది జీవిత లక్షణం. వారి మాటలు చేతలు, విన్న తర్వాత  చాలా కాలం గడిచిన తర్వాత ఆ లక్షణాలన్నింటినీ  మా శివ నాగిరెడ్డిగారి స్నేహంలో అవి చూస్తున్నాను.  చెప్పింది చేయ్ చేసిందే చెప్పు అని గాంధీ లాంటి వారు చెప్పింది, బుద్ధ భగవానుడు స్వయంగా ఆచరించింది మా శివనాగిరెడ్డి కి సొంతం. తాను చేయలేని పనిని నెత్తి కెత్తుకొని  గడపడం ఆయన జీవితంలో లేదు. చేయగలను అని అనుకున్న దానిని మాత్రమే...ఆచరణలో పెట్టగలను అన్న పని తనకు నచ్చిన తర్వాతనే  ఆ కార్యక్రమాన్ని ప్రారంభించే  ఉత్తములలో ప్రథమ శ్రేణికి చెందినవారు మా శివనాగిరెడ్డి గారు ఎవరైనా ఒక విషయాన్ని గురించి ప్రసంగం  చేయమని అడిగితే  తనకు తెలిసిన విషయం కానీ, చదివి తెలుసుకొని చెప్పగలిగే విషయమైతే మాత్రమే  అంగీకరిస్తారు తప్ప సభకు వెళ్లి దంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం వారి చేత కాదు  నిర్మొహమాటంగా నేను చెప్పలేను అని అంగీకరిస్తారు. వేదాంత పరంగా కూడా తన గురించి తాను తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అది అందరికీ సాధ్యం అయ్యేది కాదు  అలా సాధించడానికి కారణం  బుద్ధుని బోధనలు అధ్యయనం చేయడం  వల్ల ఏర్పడినది అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా బీద వారిని చదివించడం కానీ, ఎవరికైనా ఆర్థిక సహాయం చేయడం లోనైనా కానీ, వ్యక్తిగతంగా తాను కానీ, తన సంస్థ గానీ  ఆ స్తోమత  ఉంటే మాట ఇస్తారు. మాట ఇచ్చిన తర్వాత దానిని తప్పడం వారి జన్మలో లేదు. అలా గుప్తదానాలు చేయడంలో కానీ,  బీద విద్యార్థులకు చదువు చెప్పించడంలో కానీ తన సంస్థ ద్వారా ఎంతో చేస్తూ ఉండడం  ఎవరికీ తెలియని విషయం. జీవితంలో ఒకరికి ఆదర్శప్రాయంగా ఉండాలి తప్ప ఒకరితో వేలు పెట్టి చూయించుకునే స్థితికి రాకూడదు అనేది తన జీవితాశయం అనుకున్నారు.  అలాగే పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు ముందు తను తరువాత తన కుటుంబం ఆ తర్వాత తన ఆఫీస్ ఆ తర్వాత బయట వాళ్లు ఈ క్రమంలో ఎవరికి ఎలా సర్దుబాటు చేయాలో అలా చేసుకుంటూ రావడం  ఆయన విజ్ఞత.

 


కామెంట్‌లు