గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (33);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజ.యవాడ కేంద్రం.9492811322

 శివ నాగిరెడ్డి ఆఫీస్ లో జరుగుతున్న ఒక సాహిత్య కార్యక్రమంలో  మధ్యలో  నన్ను వేదికపైకి పిలిచి  మీరు 18 సంవత్సరాలు ఆకాశవాణి ధర్మసందేహాలు కార్యక్రమంలో ఉషశ్రీ గారికి శిష్యుడుగా ఉన్నారు. అనేక  భారత, భాగవత, రామాయణ కథలనే కాక సాహిత్య అంశాలను కూడా ప్రవచించేవారు.వారితో మీ అనుభవం చెప్పండి అని అడిగారు. నేను ప్రారంభిస్తూ  కాకినాడలో సాహిత్య కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు  కొంచెం సమయం ఉండి నేను, గురువు గారు ఉష శ్రీ గారు టీ తాగడం కోసం హోటల్ కి వెళ్ళాము. ఆ పైన వ్రాసిన అక్షరాలను చూసి  నవ్వుకుంటూ  అరే ఆ అక్షరాలు చదవరా  సరిగ్గా రాశాడా తప్పులు ఏమన్నా ఉన్నాయా అని అడిగారు  నేను చదివితే  శాఖాహార  భోజనం అని ఉంది  చాలా నిజాయితీగా చాలా బాగా రాశారు సార్ ఆయనను అభినందించాలి అన్నాను అరే నువ్వు నాకు శిష్యుడిగా పనికిరావురా మరొకరిని వెతుక్కుంటాను  అంటూ లోపలకి వచ్చాము సరళం  (క) పరుషం (ఖ) ఈ రెంటికీ భేదం తెలియని వాడివి  నా శిష్యుడిగా ఎలా పనికొస్తావ్ అనే సరికి నేను ఒక చిరునవ్వు నవ్వి గురువుగారు మీరు చెప్పింది అక్షరాలా నిజం  ఎప్పుడు సరళంగా ఉండాలో ఎప్పుడూ పరుషంగా ఉండాలో తెలియాలి. మీరు మీ నాన్న గారు ఆ పై తరం వారు  ఆకు కూర ఏదైనా ఆ పై ఆకులనే తుంచి కూర చేసి ఆనందంగా తినేవారు ఇవాళ అలా కుదురుతుందా ఆ రోజున జనాభా ఎంత? ఇప్పుడు జనాభా ఎంత? పండిన పంట అందరికీ సరిపోతుందా? కనుక  శాఖ (కొమ్మ) అర్థంలో మీరు మాట్లాడుతున్నారు. శాక పాకాలు మీరు ఎలా తిన్నారో  ఇవాళ శాఖతో సహా నరికి అది అదే అని తెలియకుండా సాంకేతికంగా నుజ్జునుజ్జు చేసి మనకు తినిపిస్తారు ఈ హోటల్ యజమాని. అతని నిజాయితీని మీరు గుర్తించకుండా శబ్దాలలో ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే గ్రహిస్తే అతని వ్యాపారఏమై పోతుంది ఏ ఆడపిల్లయినా సరళంగా  ఉండాలని అనుకుంటుంది తప్ప పౌరుషాన్ని  కోరుకోదు. ఈ వాస్తవికతను దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడాను తప్ప ఇవాళ వ్యాపార సరళి ఎలా ఉందో తెలియజేయడం కోసం చెప్పాను తప్ప ఆ శబ్దానికి అర్థం తెలియక కాదు అనేసరికి నేను ఆ కోణంలో ఆలోచించలేదు  నీవేనా సరైన శిష్యుడవు అని భుజం తట్టినప్పుడు అంతకు మించిన ఆనందం మరేం కావాలి అని చెప్పేసరికి శివ నాగి రెడ్డి గారు  అద్భుతంగా చెప్పారు సార్  మీరు శిష్యులుగా కాక జగద్గురువుగా పనికొస్తారు అనిపిస్తోంది నాకు అనేసరికి నేను నిత్య విద్యార్థిని సార్ గురుత్వం నాకు అవసరం లేదు అనే సరికి  ప్రేక్షకుల కరతాళ ధ్వనులు.

కామెంట్‌లు