గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (38);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సర్వ కళా పారంగతుడు  అంటే ఇదేదో  సినిమాకు పెట్టిన పేరు అనుకుంటారు కానీ కాదు నేను శివనాగిరెడ్డి గారికి ఇచ్చిన బిరుదు. వారికి ఇది తెలుసు అది తెలియదు అని లేదు.  ప్రసంగం, సంభాషణ, పరిచయ కార్యక్రమం, చర్చా కార్యక్రమం,  గోష్ఠి కార్యక్రమం ఏదైనా సరే దానిలో తన ముద్ర ఉంటుంది.  మిగిలిన వారు ఎనైనా చెప్పనివ్వండి  కొన్ని విషయాలు చాలా అద్భుతంగా చెబుతారు. నాటిక తెలుసు నాటకం తెలుసు ఏకపాత్రాభినయం,  మూకాభినయం, బహు పాత్రాభినయం తెలుసు ఏ విషయాన్ని గురించి మాట్లాడమంటే అది మాట్లాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అలాగే కథ, కథానిక, నవల, సాహిత్య సాంస్కృతిక రంగాలలో దేని గురించి అయినా నాట్యాన్ని గురించి దానిలో ఉన్న విభాగాలను గురించి వాటి మూల సిద్ధాంతాలను గురించి  చక్కగా వివరించగల  పాండిత్యం ఉంది. ఆంధ్ర దేశంలో ఉన్న జానపద కళలన్నిటిలోను ఆసక్తి ఉంది  
ఒక రోజు నాటకాన్ని గురించి మాట్లాడవలసి వస్తే  బళ్లారి రాఘవాచార్య  గారిని దృష్టిలో పెట్టుకొని  వారి ముందు తరం వారు ఎలా చేశారు తరువాత తరం వారు  ఎలా చేస్తున్నారు  అంటూ మూడు విభాగాలుగా విభజించి మాకు చక్కగా వివరించారు  మొదట్లో సాంకేతికంగా పురోగతి లేదు  పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకొని  నాలుగు బల్లలు వేసి  4 దుప్పట్లు కట్టి ప్రదర్శనలిచ్చేవారు. అప్పటికి స్త్రీలు నాటకాలంటే భయపడేవారు. అందువల్ల ఎవరూ ముందుకు రాలేదు  స్త్రీ పాత్రలు కూడా పురుషులే  ధరించి దానికి జీవం పోసేవారు పద్యాలకు ఎంతో  విలువ ఇచ్చే వారు. పాటతో పాటు  శృతిని  పెంచి రాగాన్ని చాలా సేపు అలపించే వారు  ఎవరు ఎక్కువ సేపు రాగాన్ని చెప్పగలిగితే వారు అంత గొప్ప నటుడు. బళ్లారి వారి దగ్గరికి వచ్చేటప్పటికి  కొంచెం సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏమిటి?  మైకులు వచ్చాయి  దానిని ఎలా ఉపయోగించుకోవాలో చక్కగా  వాడుకొని చక్కని ప్రదర్శన ఇస్తే  ప్రేక్షకులకు ఎంతో ఆనందం కలుగుతుంది. తరువాత తమ దగ్గరకు వచ్చేసరికి సహజత్వానికి పెద్ద పీట వేశారు  రచన సహజంగా ఉండాలి  నటన  కృతకంగా ఉండకూడదు. అతను ఏ పాత్ర పోషిస్తున్నాడో ఆ పాత్రను అనుసరించాయి తప్ప అనుకరించకూడదు అనుకరిస్తే అతనే వచ్చి నటిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ పాత్ర అలవాట్లను  పద్ధతులను చూపించడమే దాని  ప్రయోజనం. అంతవరకు చేయగలిగితే అతను మంచి నటుడిగా పేరు పొందుతాడు  లేకుంటే మామూలే.  భీముని పాత్ర  అసలే కోపిష్టి సాధారణం అతనికి కోపం వస్తే ఎలా ఉంటుంది. ధర్మరాజు శాంతమూర్తి అతనికి కోపం వస్తే ఎలా ఉంటుంది ఆ రెండు పాత్రలు ధరించే నటులు  ఆ రెండు వేషాల భేదాలను చూపించ గలిగితే ఆ నాటిక  రాణిస్తోంది. శృతి లో కానీ  నడకలలో కానీ  అర్థం పర్థం లేని  అవసరం లేని నడకలతో కానీ  ప్రదర్శిస్తే దానిని ఎవరు హర్షించరు.  ఎవరికివారు ఆ పాత్రను ఏ రీతిలో ప్రవర్తించాలో అలా చేస్తే మరింత మంచి పేరు వస్తుంది  మంచి ప్రదర్శనగా నిలుస్తోంది.  ఇవన్నీ రెడ్డి గారు చెబుతూ ఉంటే మాకు మాత్రం ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడా నటించని వారు ఇంత లోతైన విషయాలు ఎలా చెప్పగలిగాడు అని. అందుకే వారంటే మాకు గౌరవం.


కామెంట్‌లు