గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (40);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 జీవి బ్రతకడం కోసం  గండ్రగొడ్డలిని చేతబూని  కనిపించిన జంతువులను చంపి ఆకలి తీర్చుకోవడం  పరశురామ అవతారానికి ప్రతీక. తరువాత రామావతారంలో ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంది కదా దానిని చంపి మన ఆకలి తీర్చుకోవడం మంచిది కాదు  ప్రకృతిలోకి వెళ్ళి  అది ప్రసాదించిన పండ్లు ఫలాలతో కందమూలాలతో కడుపు నింపుకో వచ్చు కదా అన్న ఆలోచనతో జీవితం  ప్రకృతి దగ్గరకు వెళ్లడం కాదు ప్రకృతిని నీ వద్దకు తెచ్చుకోవాలి అని నాగలి చేత పట్టి  వ్యవసాయదారునిగా మారి పంటలు పండించి మానవుల ఆకలి తీర్చడం బలరామ అవతారం. చివరి తొమ్మిదో మాసం  లో ఆ బిడ్డకు మెదడు ఆలోచనలు వస్తుంది  ఆ స్థితిలో ఆ బిడ్డ భూమిపైకి వచ్చి  ఎన్నో మార్పులతో ఈరోజు  ఇలా మనం ఉన్నాం.  అని పరిణామ సిద్ధాంతం ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు డార్విన్ దగ్గరనుంచి  మితవాద సిద్ధాంతాన్ని నమ్మిన  ఏటుకూరి బలరామమూర్తి గారి వరకు అనేక మంది అనేక రకాలుగా పరిణామ సిద్ధాంతాన్ని గురించి చెప్పారు ప్రత్యేకంగా కోతి నుంచి మనిషి పుట్టాడు అనేది. మనిషి మనిషి గా జన్మిస్తాడు కోతి కోతి గా వస్తోంది  మీరు చెప్పినట్లు అది నిజమైతే కోతి జాతి  నిర్మూలనం కావాలి కదా. మరి ఆ జాతి కూడా ఉందిగా అనేది మరొక వ్యాఖ్యానం. స్త్రీ పురుష సంగమంతో కలిసి మానవ శరీర నిర్మాణం అవుతుంది  ప్రత్యక్షంగా మనం చూస్తున్న విషయం ఇది దీనిని మరొక రకంగా చెబితే  ఎవరంగీకరిస్తారు ఈ ప్రపంచంలో ఏ జీవి నుంచి మరొక జీవి రావడం అనేది మానవమాత్రులకు తెలియదు శాస్త్రజ్ఞుల లోనే  భిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు  సామాన్య మానవుడి పరిస్థితి ఏమిటి కనుక ఆ ప్రకృతి నిర్మితమైన ఈ శరీరం మానవుల వల్లనే వచ్చినది  మానవుని గానే ఉన్నది ఎలాంటి మార్పు లేదు అన్నది అతి సామాన్యుడు కూడా అంగీకరించే విషయం అని నా భావన అని చెప్పిన తర్వాత రెడ్డి గారు వేదికపైకి వచ్చి  మీ ఆలోచనలను అభినందించాలి  నవ్యతతో పాటు భౌతిక విషయాలను కూడా చెప్పగలిగిన మేధస్సు అన్న తర్వాత ప్రేక్షకులంతా కరతాళ ధ్వనులతో ఆమోద ముద్ర వేశారు. అలాంటి  మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో దిట్ట శివనాగిరెడ్డి  వారికి  కృతజ్ఞతలు.

కామెంట్‌లు