దేవీశరన్నవరాత్రోత్సవాలుప్రారంభం-పద్యాంజలి!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి :- 6300474467
 01.
తే.గీ.
స్వాగతముమీకుదుర్గమ్మస్వాగతమ్ము
భక్తతతిగావయరుదెంచివచ్చితీవు
నవమిరూపాలుధరియించినడుగిడిభువి
జాలినొసగుచుమరువకలీ‌లజూపు!!!

02.
తే.గీ.
భజనకీర్తనలనుపాడిప్రస్తుతించి
రకరకముపిండివంటలుచకచకముగ
వండినైవేద్యమర్పించిచండిగౌరి
మీదుకృపకునుపాత్రులమౌదుమమ్మ!!!

03.
తే.గీ.
సర్వశక్తిప్రసాదించిచాలినంత
సంపదలనిచ్చి,రోగాలచంపుమమ్మ
జన్మసార్థకమగునటుసంబరముల
నిలుపబూనగమీదృష్టినిలుపుమమ్మ!!!

04.
తే.గీ.
కోరికలుదీర్చు,ముదమారకొలుచునట్లు
వరములీయవెజగదాంబవైభవముగ
మూడుపూటలభోజనమ్మునునొసంగి
తిండిలోటునుదీర్చవెదండిగాను!!!

05.
తే.గీ.
ఋణసమస్యలనన్నియురూపుమాపి
కరువుకాటకములనుండిదరికిజేర్చి
కోపతాపాలులేనట్టిగుణమునిచ్చి
మీదుదీవెనలందించిమేలుగూర్చు!!!

06.
తే.గీ.
మిమ్ముశ్రద్ధతోపూజించెనమ్మకమును
నిమ్ముకాత్యాయనీదేవిహేమదాంబ
దుర్గుణాలవియున్ననుతొలగజేసి
భక్తిమార్గానపయనించుశక్తినివ్వు!!!

07.
తే.గీ.
బ్రతుకుపండించునట్లుగభాగ్యమిడియు
మిగులసంస్కారభావమ్మునగణితముగ
జనులలోకూర్చిజగమేలుననుదినంబు
సత్యధర్మమ్ముగెలిపించుసన్నితముగ!!!

08.
తే.గీ.
కొంగుబంగారమైయుండికొండదిగియు
ఏలుమమ్మేలుశాంభవిజాలమేల
అమ్మదయయున్నసమకూరునన్నిపనులు
రావెముల్లోకసంచారిరయముగాను!!!

09.
తే.గీ.
ఎపుడుపోవునోప్రాణమ్మునెవరికెరుక
జీవమున్నంతకాలమ్ముచేతులార
మీదుసేవలనొనరింతు‌,వేదనలను
బాపుమోయమ్మసంధాయిభద్రకాళి!!!


కామెంట్‌లు