"నవదుర్గామాతస్తుతి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి :- 6300474467
 01.
తే.గీ.
అర్ధచంద్రునిశిరమునయమ్మవారు
దాల్చిదునుమాడుదుష్టులత్వరగతాను
సింహవాహనమెక్కియుసిరులనివ్వ
చంద్రఘంటగానరుదెంచెసమ్ముదమున!!!

02.
తే.గీ.
తనదుచేతిలోఖడ్గమ్ముతనరునటుల
పట్టుకొనిబాణముధరించిప్రాభవంబు
తోడయలరారిదుర్గమ్మపీడలన్ని
తొల్గజేయుచుభక్తులతోడునిల్చు!!!

03.
తే.గీ.
అమ్మదయయున్ననన్నియునమ్మగూర్చు
ఆమెచల్లనికృపలోనసీమలన్ని
పరిఢవిల్లుచునుండునుపచ్చగాను
భయముబాపుచుజగదాంబభద్రతనిడు!!!
కామెంట్‌లు