"నవదుర్గామాతస్తుతి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-చరవాణి :- 6300474467
 01.
తే.గీ.
స్కందమాతగాదుర్గమ్మశాంతమొసగి
జ్ఞానశక్తిని,యుక్తినిమానితముగ
నొసగుచుండియునైశ్వర్యమొసగుచుండి
చల్లగాజూచిరక్షించునెల్లవేళ!!!

02.
తే.గీ.
అగ్నికినియధిదేవతైయలరుచుండు
అమ్మయొడిలోనస్కందుడునాడుకొనుచు
పూజలొందుచుసంపూర్ణమోక్షమునిల
మరువజాలకనందించుమురిసిపోయి!!!

03.

తే.గీ.
జననమరణమ్మువింతగాజరిగిపోవు
నీదునామగానమ్ముతోవేదనలవి
తీరిపోవునుపుడమిపైతీరుగాను
అమ్మనీకృపయేమాకునసలుశుభము!!!

కామెంట్‌లు