జంక్ ఫుడ్స్;-డా.నీలం స్వాతి, చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పిల్లలు ఇష్టంగా తినే వాటిలో ఈ జంక్ ఫుడ్స్ అనేవి ఒకటి.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెడితే పిల్లలు వాటిని తినరు సరి కదా వాటిపై అయిష్టాన్ని ఏర్పరచుకుంటారు. అలా జరిగితే చాలా ప్రమాదకరం. మీరు గమనించారా... మనం చిన్నతనం నుంచి ఏదైతే పదార్థాన్ని తినకుండా ఉంటామో పెద్దయ్యాక దాన్ని అస్సలు ముట్టను కూడా ముట్టం. పిల్లలకు మంచి పోషక విలువలు ఉన్న పండ్లను కోసిపెట్టండి వాళ్ళు అవి తినరు. అదే నూడిల్స్ గానీ, పానీ పూరి గానీ తెచ్చి పెట్టండి మరో మాట మాట్లాడకుండా 
ఇష్టంగా తినేస్తారు. ఇంట్లో చేసినవేమి పిల్లలకు నచ్చవు చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీములు ఇవే కావాలి. అయితే పిల్లలు ఈ ఆహారపు వ్యవహారాలకు అలవాటు పడితే చిన్న వయసులోనే ఉబకాయం ( ఒబిసిటీ) కి గురి కావలసి వస్తుంది. ఈ తిను బండారాల వల్ల బాడీలో ఫ్యాట్ అక్యుములేషన్ బాగా పెరిగిపోయి బరువు విపరీతంగా పెరగడమే కాక, లేనిపోని అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుంది. అయితే దీనిని అదుపు చేసేది ఎలా?
ఆహారం విషయంలో మాత్రం పిల్లలకు పెద్దలు ఆప్షన్స్ ఇవ్వకూడదు. చిన్నప్పటినుంచే 
జంక్ ఫుడ్స్ కు అలవాటు పడకుండా జాగ్రత్త పడాలి.
పిల్లల విషయంలో పెద్దలు కూడా పిల్లల్లానే వ్యవహరించాలి. చిరు తిండి రూపంలో 
వేరుశనగ ముద్దలు, నువ్వులు,
గుగ్గుళ్లు, మొక్కజొన్న లాంటి వాటి పేరు చెప్పి మెల్లగా వీటిలో నాకు ఇది కావాలి, నీకు ఏది కావాలి అంటూ వారిని అడిగితే?
వారికి అవకాశం లేదు కనుక వీటిలో ఏదో ఒక పేరు చెప్పి తీరుతారు. అప్పుడు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని వారికి అందించవచ్చు. దాంతో ఈ జంక్ ఫుడ్ మీద మోజు కాస్తయినా తగ్గుతుంది. అలానే రకరకాల పండ్లు పేర్లు చెప్పి, మనం తింటూ వారి చేత కూడా తినిపించాలి. ఇలా చేస్తే పిల్లల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళమవుతాం. ఒకసారి ఈ చిట్కాను మీరు ప్రయత్నించి చూడండి.


కామెంట్‌లు