పి.సి.ఓ.డి;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ప్రస్తుతం చాప కింద నీరులా విస్తరిస్తున్న రుగ్మతలలో పిసిఓడి అనేది ఒకటి. ఆడవాళ్లకు గైనిక్ సమస్యలు అనేవి మామూలే అయినా ఈ పిసిఓడి బారిన పడుతున్న వారు మాత్రం ఎక్కువ శాతం యువతులే. అసలు ఏంటి పిసిఓడి? పీసీఓడీ అంటే పోలీసిస్టిక్ ఒవేరియన్ డిసీస్ దీనినే పోలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని కూడా అంటారు.
సాధారణంగా నెల సరి (menstruation) అనేది ప్రతి నెల జరిగే ఓ ప్రక్రియ. అయితే ఈ సిండ్రోమ్  ఉన్న వాళ్ళలో నెలసరి సరిగ్గా రాకపోవడం, వచ్చినప్పుడు విపరీతమైన నొప్పితో పాటు హెవీ బ్లీడింగ్ జరగడం వల్ల నీరసం, కళ్ళు తిరగడం లాంటివి జరుగుతాయి. దీని ప్రధాన లక్షణాలను గురించి చెప్పాలంటే
నెలసరి సమయంలో ఎక్కువ మోతాదులో రక్తస్రావం అవ్వడం, ఎక్కువ రోజుల పాటు నెల సరి కావడం, లేదా అసలు కాక పోవడం (irregular periods), వున్నట్లుంది బరువు బాగా పెరిగి పోవడం, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి రావడం, జుట్టు రాలిపోవడం, మొహం పైన హేర్ డెవలప్ అవ్వడం లాంటి సమస్యలు
ఎక్కువగా ఉంటాయి. ఇది ట్రీట్  చేయక పోతే హార్ట్ డిసీజెస్, టైప్ 2 డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ లాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణం. అయితే దీనికి
ట్రీట్మెంట్ అనేది రకరకాలుగా ఉంటుంది. హార్మోనల్ థెరపీతోపాటు, ఐరన్ డెఫిషియన్సీని ట్రీట్ చేయడం, ఎక్సర్సైజులు చేయడం, మెడిటేషన్, యోగా లాంటివి చేయడం, ఎక్కువగా నీరు త్రాగడం, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ని సేవించడం లాంటివి. సైకిల్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు బరువు తగ్గించుకోవడానికి. 
హెచ్చరికలు జారీ చేయడం అనేదే నా వంతు అది పాటించడం పాటించకపోవడం అనేది మీ ఇష్టానుసారం...
బాధ్యతగా ఈ చిన్ని డాక్టరు చెప్పిన మాటలను బుద్ధిగా వింటారని భావిస్తూ...


కామెంట్‌లు