డిప్రెషన్;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చెప్పుకుంటూ పోతే చాలానే వస్తాయి. అందుకే చివరగా ఈ డిప్రెషన్ గురించి మాట్లాడుకొని వీటికి స్వస్తి పలికే ప్రయత్నం చేద్దాం. మనది సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే పొద్దున లేచిన మొదలు పడుకునే వరకు కంప్యూటర్, ల్యాప్టాప్ లు ముందర గంటలు గంటలు గడపడం, కదలకుండా ఒకే దగ్గర కూర్చుని ఉండిపోవడం. దీనివల్ల శరీరానికి వ్యాయామం ఉండదు. దాంతోపాటు మన ఆహారపు అలవాట్లు అర్ధరాత్రి వరకు మేలుకోవడం ఎక్కువగా పిజ్జాలు, బర్గర్ లాంటివి  తినడం. చేసే ఉద్యోగాలు అలాంటివి మరేం చేయమంటారు అని కసురుకోకండి? ఇలా అర్ధరాత్రి వరకు ఒకే పనిపై దృష్టిని కేంద్రీకరించడం వల్ల,
సరిగ్గా ఆహార నియమాలను పాటించకపోవడం వల్ల, స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దీని కారణంగా 
అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది ఇలాగే ఏళ్ల తరబడి కొనసాగిస్తే
డిప్రెషన్ కు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. దీనికి లక్షణాలు ఏ పనినీ ఇష్టంగా చేయలేకపోవడం, ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచించడం, 
ఆకలి తగ్గిపోవడం, నిద్ర లేమి,
అలసట లాంటివి. నన్ను అడిగితే ఈ డిప్రెషన్ కి యాంటీ డిప్రెస్సంట్స్ లాంటి మందులు ఉన్నా సొంతగా కొన్ని అలవాట్లను మార్చుకుని మందులకు అలవాటు పడకుండా ( వీడికి additive ప్రాపర్టీ అనేది ఉంటుంది) ఈ ఇబ్బందిని పోగొట్టుకుంటేనే మంచిది అయితే దీనికి పరిష్కారం మార్గాలు లేవా అంటే ఉన్నాయి. వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతూ, సాయంత్రం పూట
చల్లగాలిలో జాగింగ్, వాకింగ్ లాంటివి చేయడం వల్ల బాడీలో యాక్టివ్ నెస్ పెరుగుతుంది. నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల
నిద్ర బాగా పడుతుంది.
అయితే పాలు తాగితే నిద్ర పడుతుందా అంటూ ఎదురు ప్రశ్నలు వేయకండి?
నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళకి
డాక్టర్లు స్లీప్ హైజీన్ గురించి సూచిస్తారు. స్లీప్ హైజీన్ లో 
భాగంగా రూమ్ లో బ్లాక్ కర్టెన్స్ ని వుంచడం, కాఫీ, టీ లాంటివి రాత్రి సమయంలో సేవించక పోవడం, బుక్స్ చదవడం, డిమ్ లైట్స్ ను ఉపయోగించడం లాంటివి చేస్తే మంచి నిద్ర పడుతుంది.
హెచ్చరికలు జారీ చేయడం అనేదే నా వంతు అది పాటించడం పాటించకపోవడం  మీ ఇష్టానుసారం...
బాధ్యతగా ఈ చిన్ని డాక్టరు చెప్పిన మాటలను బుద్ధిగా వింటారని భావిస్తూ...


కామెంట్‌లు