ఉపాధ్యాయిని శిక్షణ;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మితంగా ఉన్న దానిని అమితంగా చేయడం  అమ్మ కు మాత్రమే తెలిసిన విద్య  చిన్న పిల్లవాడిని విద్యాలయానికి పంపించినప్పుడు  ఉపాధ్యాయుడు చక్కగా వాడికి అక్షరాభ్యాసం చేసి  పుస్తకాలను చదివే స్థితికి తీసుకు వస్తారు. చిన్న పిల్లలకు ఆటల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఉండకపోవచ్చు. చిన్నపిల్లలు ఒకరికొకరు మాట్లాడుకుంటూ మాటా మాటా పెరిగి వారిలో వారు  దెబ్బలు ఆడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. వీటిని గమనించిన ఉపాధ్యాయుడు  పాతరోజుల్లో చెవి మెలిపెట్టే వారు తొడపాశం పెట్టేవారు. ఆ రోజుల్లో నేను పెను బెత్తం ఉండేది. దానితో  కొడితే చాలా చురుగ్గా ఉంటుంది  చాలా బాధగా ఉంటుంది  ఆ పద్ధతులను అవలంభించడం వల్ల కుర్రవాడు సరైన మార్గంలో  నడుస్తాడు అని వారి అభిప్రాయం.
ఆ సమయంలో అమ్మ రంగంలోకి దిగుతుంది  పిల్లలకు ఎలా బుద్ధి చెప్పాలి, పాఠాలు ఎలా నేర్పాలో  ప్రత్యక్షంగా చెప్తుంది. అందుకే చిన్న పిల్లలకు  విద్యాభ్యాసం చేసేటప్పుడు ఉపాధ్యాయురా లిని ఏర్పాటు చేస్తున్నారు  ప్రభుత్వం కూడా అందుకు సమ్మతించింది. ప్రతి చిన్న పిల్లవాడిని తమ సొంత బిడ్డ లాగా కాచి రక్షించేది ఉపాధ్యాయని సమయాన్ని నిర్దేశిస్తుంది  ఏ సమయంలో ఏం చేయాలి  ఉదయం రాగానే  నిన్నటి పాఠాలు అప్పజెప్పడం  కొత్త పాఠాలు సాధన చేస్తూ చదవడం  మధ్యలో విశ్రాంతి సమయంలో కబుర్లు చెప్పుకోవడం ఆడుకోవడం పాడుకోవడం పిల్లలకు ఆకలి వేసినప్పుడు అమ్మలా వారి ఆకలి తీర్చడం సాయంత్రం వారందరితో కొత్త కొత్త ఆటలు  ఆడించడం పిల్లలు ఏది కోరితే  అంటే వాడు ఏ ఆటలు ఆడదలచుకున్నారో  వాటిని గురించి  వారికి పూర్తి స్వాతంత్రం ఇస్తోంది అమ్మలా  దానితో కుర్రవాళ్ళకు  కన్న తల్లిని మించిన  చొరవ ఆమెమీద ఏర్పడుతుంది.  కొట్టకుండా, తిట్టకుండా దండించకుండా నమ్రతగా  వారికి అర్థమయ్యే పద్ధతిలో వారు చెప్పింది తప్పకుండా వింటారు. మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రాముడు బుద్ధిమంతుడు అన్నట్లుగా  మంచి పనులు  కొత్త కొత్త విశేషాలు నేర్చుకోవడంలో  అభిరుచిని పెంచుకుంటాడు. ఆటల్లో గానీ, పాటల్లో గానీ సాటివారిని అందరిని ఏకం చేసి  ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా ప్రవర్తిస్తూ  ఉపాధ్యాయినికి మంచి పేరు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తాడు  మారుతున్న కాలంతో పాటు మనం మారి వారి అభిరుచులకు అనుగుణంగా మనం కూడా ప్రవర్తించినప్పుడు  ప్రతి బాలుడు శ్రీరామచంద్రుడు అవుతాడు  ఇది నా అనుభవం  మీరు కూడా ఆలోచించి చూడండి  దాని రుచిని ఆస్వాదించండి  అంతకు మించి నేను చెప్పేదేమీ లేదు.


కామెంట్‌లు