ఆరోగ్యానికి ఒక గ్లాస్ మిల్క్;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదేనన్న విషయం అందరికీ తెలుసు. అయితే పాల వల్ల కలిగే ప్రయోజనాలను కాస్తంత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పాలలో పుష్కకళంగా లభించే పదార్థం క్యాల్షియం. ఎదిగే పిల్లలలో ఈ క్యాల్షియం అనేది కీలక పాత్ర వహిస్తుంది. కాల్షియం వల్ల బోన్ డెన్సిటీతో పాటు, మజిల్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. పాలలో 87 శాతం నీళ్లు, 13% ఘన పదార్థాలు ఉంటాయి. అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్, ఫ్యాట్స్ ,యాంటీ ఆక్సిడెంట్స్ వుంటాయి. పాలలో  "లాక్టోస్" అనే షుగర్ ఉంటుంది. ఆహారం అంటే ఇష్టపడని పిల్లలకు ఒక గ్లాస్ పాలు ఇచ్చి వారిలో పౌష్టిక ఆహార లోపాన్ని రానీయకుండా కాపాడుకోవచ్చు. ఆటలలో పడి ఆహారాన్ని సరిగా తినరు. అందువల్ల వారు అనేక రకాల రుగ్మతలకు లోను కావలసి వస్తుంది. పాల వల్ల దంతాలు దృఢమవుతాయి, రోగనిరోధక శక్తితో పాటు, జుట్టు, కళ్ళు ఆరోగ్యకరంగా ఉంటాయి. మలబద్ధకం చేసిన పిల్లలకు ఈ పాలే చక్కని ఔషధం. రాత్రి నిద్రపోయే ముందు పిల్లలకు ఒక గ్లాస్ పాలను తాగిస్తే వారికి చక్కటి నిద్ర పడుతుంది. చిక్కని పాలు తాగడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి పిల్లలు రెట్టింపు ఉత్సాహంతో చదువుపై శ్రద్ధ పెట్టగలుగుతారు. పాల వల్ల ప్రయోజనాలు అనేకమైనప్పటికీ, విటమిన్ సి మాత్రం ఇందులో లభించదు.
కనుక సిట్రస్ ఫ్రూట్స్ (నిమ్మ జాతి పళ్లను) కూడా ఆహారంలో భాగంగా కలిపి పిల్లలకు అందిస్తే ఆరోగ్యవంతమైన జీవితాన్ని, ఆహ్లాదంగా, ఆనందంగా అనుభవించగలుగుతారు మన చిన్నారులు. అందుకే పిల్లలతో పాలు తాగించడం అలవాటు చేయండి అచ్చంగా పాలు తాగని వారికి ప్రోటీన్ పౌడర్ లాంటివి అనేకం మార్కెట్లో లభిస్తూనే ఉంటాయి. వాటిని కలగలిపైనా మనం వారికి అందించాలి తప్ప విస్మరించకూడదు.


కామెంట్‌లు