గాంధీ సిద్ధాంతం ;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఉమ్మడిగా చేసే కార్యక్రమం ఏదైనా విజయవంతం అవుతుంది. ఇది ఎవరో చెబితే  విన్నది కాదు  నీ శరీరమే నీకు అన్నీ చెబుతోంది. ఆకలి అయింది భోజనం చేయమని ఎవరైనా చెబుతారా దాహమా  నీరు కావాలి అని ప్రశ్నించే వారు ఉంటారా ? నీ అంతట నీవే చేస్తావు ఈ శరీరము  భగవంతుని చూడడం కోసం దేవాలయానికి వెళుతుంది  దర్శనం చేసుకుని  రెండు చేతులతోనూ నమస్కారం చేస్తావు. నమస్కారం అంటే అర్థం  నాకున్న అహంకార, మమకారాలు అన్నిటిని  వదిలివేసి పంచేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 కలిపి 10 వేళ్ళు ఒక చోట వచ్చేట్టుగా చేసి  శిరము వంచి  మీకు దాసోహం అని అంటున్నాను అని చెప్పడం. పురోహితుడు ఇచ్చే  హారతి  రెండు చేతులతోనూ కళ్ళకు అద్దు కుంటాము  నీవు భగవంతునికి  హారతి ఇచ్చేటప్పుడు  కుడి చేత్తో హారతి పళ్లెం పట్టుకొని  ఎడమ చేతితో కుడి చేతి  మోచేతిని  పట్టుకొనే మూడుసార్లు  హారతి ఇస్తారు  అంటే ఏది చేసినా ఉమ్మడిగా చేయి అనే కదా అర్థం.
మనం కంటితో చూసిన విషయాలను అన్నీటిని జ్ఞాపకం పెట్టుకుంటామా?  మనకు అవసరమైనవి,  ఇష్టమైనవి మాత్రమే చూడడం జరుగుతుంది. అంతమాత్రం చేత మిగిలినవన్నీ పనికిరాని వనా?  వాటిలో ఇతరులకు పనికి వచ్చేది ఏమీ లేవా? వాటిని గురించి ఆలోచించం. కంటిలోని నలుసు అన్నాడు వేమన దాని బాధ ఏమిటో తెలుసు కనుక  ఆ బాధ ఎలా  పోతుంది. కంటికి రెండు రెప్పలు ఉంటాయి. అక్కడ శ్రీరామచంద్రుడు అడవిలో ఉన్నప్పుడు  ఆయనకు కాపలా కాస్తూ లక్ష్మణస్వామి  తిరుగుతూ ఉన్నాడు  నిద్ర కూడా మాని.  ఇక్కడ కూడా కాపలాగా ఉండే పై కంటి రెప్ప  ఎప్పుడూ కాపలా కాస్తూనే ఉంటుంది. క్రింద రెప్ప మాత్రం  కదలకుండా ఉంటుంది. ఇలాంటి  సందర్భంలో  అక్కడ కూర్చుని ఉన్న  శ్రీ రామచంద్రమూర్తి  ఆర్ధ్రత కలిగిస్తాడు  అంటే కొంచెం   తడిని అందిస్తాడు  దానితో ఆ నలుసు బయటపడుతుంది.
ప్రతి మనిషికి రెండు చెవులు ఉంటాయి  ఆ రెండు చెవుల మధ్య మెదడు ఉంటుంది.
ఎవరు ఏది చెప్పినా, దానిని ఒక చెవి విని  దానిలో మనకు కావలసిన విషయాలు ఏమైనా ఉంటే దానిని మాత్రమే ఉంచి  మిగిలిన పదార్థం మొత్తం రెండో చెవి ద్వారా బయటకు పంపిస్తుంది మెదడు. ఉమ్మడిగా చేయకపోతే  ఈ కార్యం సఫలం అవుతుందా? గాంధీ గారు చెప్పినట్లు చెడు చూడకు, చెడు మాట్లాడకు,  చెడు వినకు అంటే  మనం వినే మాటలన్నీ చెడ్డవేనా? ఏది వినకూడదు  ఆ చెప్పే వాడు మంచి మాత్రమే చెప్తాడా  వాడు ఏది చెప్పినా విను  వాడు చెప్పిన దాంట్లో మంచిని స్వీకరించి చెడుని వదిలివేయి. అలాగే చూడడం అనడం కూడా అన్ని మంచి దృశ్యాలు చూస్తూ ఉంటామా  చెడ్డవి కూడా కనిపిస్తూ ఉంటాయి కదా. వాటిని మర్చిపోయి ప్రక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మాట్లాడేటప్పుడు కూడా మంచినే మాట్లాడు అన్నది కూడా సరైనది కాదు. రెండు పెదవుల సహకారంతోనే కదా మాట బయటకు రావడం  కనుక పిల్లలకు మొదట నుంచి  కలిసి పనులు చేసుకునే విషయాన్ని  వారి స్థాయిలో వారికి అర్థమయ్యేలా అమ్మ చెబితే గాంధీ గారి ఆశయం నెరవేరుతుంది అని నా నమ్మకం. ఇక్కడ చేయవలసింది మీరే మరి కానివ్వండి.


కామెంట్‌లు