సున్నితముల ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు;- డాక్టర్ ఎం. ఎన్. బృంద-చరవాణి : 7013210398
సువర్ణమాలతో  అలంకరించిన  సున్నితాలు
తెలుగుభాషా  ప్రేమికులకు  నేతిమిఠాయిలు
ద్వితీయ వార్షికోత్సవంబునకు స్వాగతాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

వారానికొక  అందమైన  అంశము
హెచ్చును  భాషాసౌందర్య  వంశము
చతుర్పాదాల డజనుపదాలతో పారవశ్యము
చూడచక్కని తెలుగు సున్నితంబు!

చూడముచ్చటైన  అమర  మకుటం
మాత్రాఛందస్సుతో  అలంకార  రజతశకటం
రాయకపోతే  కలుగును   తీయనిఆరాటం
చూడచక్కని తెలుగు సున్నితంబు!

ముగ్గురితో  ముత్యాల  సమీక్షలు
సాహిత్య   ప్రియులకు  ఆనందవీచికలు
సంఖ్యలో  పంచకోశాలకు  ప్రతీకలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

సున్నితమైన  సుమనోహరి  సునీత
పరివారముతో  జనార్ధన  సహిత
ఆయురారోగ్యాలతో  మెండుగా  శోభిత
చూడచక్కని తెలుగు సున్నితంబు!

కామెంట్‌లు