కందంమనమున తలచ యెలుక వాహన లంభోదర చిరుదర హాసపు వదనా!గుణగణములిచ్చి జనులనుగణములకధిపతివి, కావు గౌరీ తనయాఆట వెలదిభక్తి తోడ నీకు భజన చేసెదనయ్య/వేకువనిల లేచి వేడుకగను//సేవచేయుదేను చిత్త మందున నీకు/కరుణజూపవయ్య గురువు రీతి///తేటగీతిభజన చేసి ఆ బాల గోపాలమంతసంతసించిరి ఎంతయో సలిపి పూజవీధి వీధిన నిను గొల్చి విఘ్నహారసందడిగ దలబెట్టిరి సంబరములుతేటగీతిమదిన నిరతంబు నీ నామ మనన చేసిభక్తి పారవశ్యమునందు బాగుగానుపొంగిపోయితినయ బత్తి పొరలి పొరలికరుణ చూపుమీ నాపైన గిరిజ పుత్ర*********
గణపయ్య స్తుతి ;- శివ ఇంటర్7093225602
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి