కందం పద్యాలు ;- జక్కల శివ7093225602

  క్రూర బ్రిటిష్ పాలన  కడ 
 దేరుచ  సంగ్రామమందు తెగువను చూపీ!
 పోరాడిరి ప్రాణమొసగి
 ఆరాధ్యపు దైవముగను అవనిన నిలిచెన్ 
కందం
 దోషమ్ములెత్తిజూపవు  
 రోషంబుల జూపబోకురోదన మిగులున్
  వేషముల మార్చచూడకు
 ఘోష గలిగి తుదకు నీకు కొంపలు ముంచున్
కందం
 మనసు కఠిన శిలయైపో
యెను తీరని బాధ కలిగి  యే డుపు మిగిలెన్
 తనువున సత్తువ లేకనె
 మనమున నాటినతలుపులు మంచివి కావా?
*********

కామెంట్‌లు