పద్యాలు ;- జక్కల శవ 7093225692
 
 ఆట వెలది  
 ప్రతి దినమ్ము నన్ను పాఠముల్ చదివించె
 వేకు వందు లేపి వేడ్క మీర
 గురువు వోలె నన్ను కోరినట్లుదిద్దె 
 తల్లి రుణము దీర్చ తరము కాదు 

 ఆటవెలది 
 అమ్మ యనెడి పదము  అమృతము వలెనుండు
 కమ్మనైన పదము అమ్మ పదము
 అవని లోన యున్న  అమ్మదేవతగదర 
 తల్లి రుణము తీర్చు తనయుడైతి

ఆటవెలది 
 బద్ధకమ్ము తోడ  పనులను వాయిదా 
 చేయుచుండు రీతి చేటు గూర్చు 
 పగటి కలలు కనక బద్ద కమ్ము విడిచి
 కార్యసిద్ధి కొరకు కష్టపడుము 
*********


కామెంట్‌లు