కాశీ పురాదీశ్వరీ;-కవిరత్న నాశబోయిన నరసింహ(నాన),సెల్ 8555010108.
అన్నోదక దాన గుణమే అన్నపూర్ణాదేవి ఆరాధన 
కాశీవిశ్వేశ్వరీ నామ స్మరణ సర్వవ్యాధి నివారణ! 

ఆకలి బాధ తీర్చి ఆదరించమనే సందేశం 
కుటుంబంలో తల్లి ప్రాధాన్యత చాటే అవతారం! 

ఈతి బాధల నుంచి కాపాడే కరుణామయి 
భిక్ష నొసగి సద్బుద్ధి నిచ్చు విద్యారూపిణి! 

సకల ప్రాణి చైతన్య స్వరూపిణి 
కాశీపురాధీశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరి! 

సమస్త ప్రాణి కోటి అన్నరస మయము 
భూమ్యాకాశాలు అన్నమన్నాదములన్న తల్లీ!

శక్తి స్వరూపిణి సర్వ మంగళ కారిణి భజామి 
విశ్వమానవ కళ్యాణం వీక్షించే విశ్వాంబరీదేవి!                                                                                                                                        
(దేవీ శరన్నవరాత్రోత్సవం నాలుగో రోజు అన్నపూర్ణాదేవి దర్శనం సందర్భంగా)


కామెంట్‌లు