స్వతంత్ర భారతం; గజ్జల.స్వరూపరాణి-చరవాణి:8688670957
ప్రక్రియ:సున్నితం
==============
ఎందరో మహత్ముల త్యాగఫలం
స్వతంత్ర భారత  దేశము
భిన్నత్వంలో ఏకత్వం నాదేశం
చూడచక్కని తెలుగు సున్నితంబు

మత  కలహాలు సృష్టించిన
మరణ హోమము జరిపించిన
అహింస మార్గమే నాదేశము
చూడచక్కని తెలుగు సున్నితంబు

బ్రిటీష్  విభజించి పరిపాలించిన
ఉగ్రవాదము ఉప్పెనలా ఎగిసిపడిన
బానిససంకెళ్లు  త్రెంచుకుంది నాదేశము
చూడచక్కని తెలుగు సున్నితంబు

బాపూజీ అడుగు జాడల్లో
అల్లూరి వీర పోరాటం
వీర వనితల త్యాగఫలం
చూడచక్కని తెలుగు సున్నితంబు

జాతీయ సమైక్యత తత్వము
వందేమాతరం వందేమాతరం అంటు
ఎలుగెత్తి చాటుదము నలుదిక్కుల
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు