సున్నితం ద్వీతీయ వార్షికోత్సవ వేడుకలు; అంథోల్ పుష్పలీల రేవతి--చరవాణి....8790958751
సరళమైన  సున్నిత ప్రక్రియ
సునీతమ్మ రూపొందించిన విధం
అద్భుతం అమోఘం అద్వీతీయం
చూడచక్కని తెలుగు సున్నితంబు

గృహిణులకు అనువైన అవకాశం
కొత్తవారికి తగిన ప్రోత్సాహకం
వ్రాస్తుంటే కలుగునెంతో ఉత్సాహం
చూడచక్కని తెలుగు సున్నితంబు

చక్కటి సమీక్షల సమాహారం
ప్రతివారం ఓప్రత్యేక అంశంతో
గుర్తింపు పొందిన సమూహం
చూడచక్కని తెలుగు సున్నితంబు

మాతృభాషను కాపాడే యత్నం
తేనెలూటల తెలుగు విశ్వవ్యాప్తం
రూపకర్తకు నాయొక్క వందనం
చూడచక్కని తెలుగు సున్నితంబు

సాగాలి ప్రక్రియ కలకాలం
బిరుదులు అందించాలి సతతం
చిరస్తాయిగ నిలవాలి సున్నితం
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు