:స్వతంత్ర భారతం.; కుసుమంచి నాగమణి.చరవాణి: 8897334922
ప్రక్రియ: సున్నితం.
===============
అనేక సంవత్సరాల పోరాటాలు
మేధావుల చైతన్య ఉపన్యాసాలు.
అతివాదుల సాయుధ పోరాటాలు.
చూడచక్కని తెలుగు సున్నితంబు.

 గాంధీజీ చంపారన్ సత్యాగ్రహాలు.
నాయకుల నిరాహార దీక్షలు.
అలుపెరగని శాంతియుత ఉద్యమాలు.
చూడ చక్కని తెలుగు సున్నితంబు.

ధర్మం సత్యం అహింసామార్గాలు.
మితవాదుల శాంతియుత విధానాలు.
కీలకపాత్ర  వహించిన  సమావేశాలు.
చూడ చక్కని తెలుగు సున్నితంబు.

క్విట్ ఇండియా ఉద్యమాలు.
సత్యాగ్రహ విదేశీవస్తు బహిష్కరణలు.
శివాజీ జాతీయసమైక్యతా భావాలు.
చూడ చక్కని తెలుగు సున్నితంబు.

 సమరయోధుల త్యాగ ఫలాలు.
సంస్కర్తల చైతన్య విధానాలు.
ఏకత్రాటిపై నడిపించిన నాయకత్వాలు.
చూడ చక్కని తెలుగు సున్నితంబు.

కామెంట్‌లు