స్వతంత్ర భారతం; పి. దినకర్ రెడ్డి-ఫోన్ : +91-9985493579
ప్రక్రియ: సున్నితం
------------------------
చరిత్రను నువ్వు మరచిపోకు
అలాగని గతములోనే ఉండిపోకు
నెత్తుటి త్యాగాలను నీరుగారిపోనివ్వకు
చూడచక్కని తెలుగు సున్నితంబు 


వేదం చదివిన నేల
వేదాంతం పెరిగిన నేల
సంయమనం కూడా పాటించాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు


ఎందరు వీరుల త్యాగఫలమిది
మరి వారిని మరచిపోవచ్చా
వారి ఆశయాలను వదిలివేయచ్చా 
చూడచక్కని తెలుగు సున్నితంబు


సిద్ధాంతాల రాద్ధాంతం వదిలేసి
కలిసి శాంతిని సంరక్షించాలి
స్వాతంత్య్రానికి అసలైన వెలుగివ్వు 
చూడచక్కని తెలుగు సున్నితంబు


ప్రగతికై సంఘర్షణ అవసరమే
సరైన మార్గంలో నడుస్తూ
జాతికి దిశానిర్దేశం చేయి 
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు