శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి;-'వాజ్ఞ్మయ రత్నాకర'" రసస్రవంతి "-- 'వాజ్ఞ్మయ భూషణ' " కావ్యసుధ " జంట కవి రచయితలు 9247313488 హైదరాబాదు
 దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో అశ్వయుజ శుద్ధ పంచమి నాడు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు త్రిపురాంత్రయంలో రెండో శక్తి ఈ లలిత దేవి. శ్రీ లలితనే త్రిపుర సుందరి అని అంటారు అలాగే త్రిమూర్తుల పూర్వము నుంచే ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి పిలువబడుతోంది. శోభ, విలాసము,గాంభీర్యము, లాలిత్యము,మాధుర్యము, తేజస్సు, సౌకుమార్యము అన్నీ ఒక రాశిగా పోస్తే లలితా పరమేశ్వరి రూపం.
         శ్రీ చక్రము, శ్రీ విద్యా మంత్రములు శ్రీదేవి స్వరూపలే. శ్రీదేవి మహాత్యమును  శబ్ద రూపంగా శ్రీవిద్య మంత్రములు వెల్లడి చేస్తాయి. శ్రీవిద్య బ్రహ్మవిద్య కనుక శ్రీవిద్య మంత్రం,శ్రీ చక్రం యంత్రం ,శ్రీసహస్రం అంటే లలిత సహస్రనామ మంత్రానికి, యంత్రానికి సంబంధించిన తంత్రం. మన శరీరమే ఒక శ్రీ చక్రం.  శ్రీ చక్రమునందు 9 ఆవరణలు ఉంటాయి. ఈ తొమ్మిది ఆవరణలు శరీరములోని తొమ్మిది ద్వారాలకు సంకేతం మానవ శరీరంలో షట్ చక్ర  సందర్శనముతో సకల దేవతలు ఒకే తత్వానికి చెందిన వారని అర్థమవుతుంది. మూలాధారములు నిద్రాణంగా ఉన్న కుండలిని మేల్కొలిపి సహస్రాన్ని చేరుస్తే, అమృత ధారలు వర్షిస్తాయి శరీరం నశించిన నశించని అమృత తత్వాన్ని దర్శింప చేస్తుంది. కుండలినీయోగ శక్తి. అదే ఆత్మవిద్య ఆత్మవిద్యను ప్రసాదించే శక్తి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి.సాధకులు ఆ శక్తిని అన్వేషిస్తూ వెళుతూ ఉంటారు తల్లి అనుగ్రహాన్ని పొంది కుండలిని యోగశక్తితో యోగ సమాధిలో అమృత తత్వాన్ని పొందుతారు.శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి ఆరాధనతో సంప్రాప్తించిన శక్తిని విశ్వకళ్యాణానికి వినియోగించాలి అని చెప్తోంది  శ్రీ లలితా పరమేశ్వరి పూజ.
          శ్రీ లలిత త్రిపుర  సుందరి దేవి సకల లోకాలకతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి.చెరుకుగడ,విల్లు పాశంకుషాలను చేతబట్టి కుడి ,ఎడమల్లో లక్ష్మి ,సరస్వతి, సేవలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తుంది.
     అట్ల బతుకమ్మ
 ఐదో రోజున అట్లు సమర్పిస్తారు గునుగు తంగేడు చామంతి మందార పూలతో పాటు గుమ్మడి పూలను ఐదు అంతరాలుగా పేరుస్తారు సాయంత్రం వేళల్లో దేవాలయ ప్రాంగణాల్లో ఆట పాటలతో పూజిస్తారు అట్లా ప్రసాదాన్ని వాయునంగా ఇవ్వడం ఆనవాయితీ.

కామెంట్‌లు