గణపతి పద్యాలు;-మమత ఐలకరీంనగర్9247593432
 తే.గీ
పసుపుతో బొమ్మగావించి పార్వతమ్మ
నంద చందాలు దిద్దుచున్నభయ మొసగి
ప్రాణమును పోసి దీవించి బాలసుతుని 
ప్రేమతో మోదకాలెన్నొ బెట్టుచుండె
తే.గీ
తల్లి మాటను మీరని తనయునిగను
నాయుధంబు చేబూనెనాయమ్మ నడిగి
బుద్ధితోడమ్మ పలుకుపై శ్రద్ధ బెట్టి
గడప ముందాసనంబేసి గాంచె శివుని

కామెంట్‌లు