గణపయ్య పద్యాలు;-మమత ఐలకరీంనగర్9247593432
 తే.గీ
తండ్రినెరుగని బాలుడై తగువు బెట్టి
గడపకడ్డమై నిలిచెను గరిమతోడ
బాలునెరుగని మహదేవ లీలజూడ
నిలచి యుండిరీ దేవతల్ నిశ్చలముగ
తే.గి
తగని తర్కంబుకిరువురు దిగినజోరు
యుద్ధ సందడిన్ నెలకొల్పె ముద్దుగాను
నంది రోషంబు జూపుచున్ నడుమజేర
బాలుడోడించె నందిని వారులోన

కామెంట్‌లు