మేలు చేసే తులసి;-కంచనపల్లి వేంకట కృష్ణారావు.9348611445

  మన పురాణాల్లో తులసి ప్రస్థావన ఉంది. తులసిని మనం అతి పవిత్రంగా పూజిస్తాము. గోదాదేవి తులసి మాలను కట్టి రంగనాథుని మెడలో వేసిన ఒక పురాణ కథ మనకు సుపరిచితమే. మనకు మేలు చేసే చెట్లు,జంతువులకు మన పూర్వీకులు వాటికి సముచిత స్థానం కల్పించి పవిత్రతను చేకూర్చారు
         తులసి వలన అనేక ప్రయోజనాలు ఉన్నట్లు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన వారు గుర్తించారు. దీని ఉపయోగాలను చరకుడు(క్రీ.పూ.300) అనే వైద్యుడు చరక సంహితలో వివరించాడు.
        తులసి శాస్త్రీయ నామం 'ఆస్సిమమ్ సాంక్టం'.దీనిని క్రైస్తవులు కూడా పవిత్ర మొక్కగా భావిస్తారు.బాసిలస్ అంటే గ్రీకు భాషలో చక్రవర్తి. కొన్ని పెద్ద చర్చీలను 'బాసిలికా' అని పిలవడం తెలిసిందే!శిలువ కింద తులసి మొక్కలను కూడా వారు పెడుతుంటారు.నీళ్ళలో తులసి ఆకులు కలపడంవలన నీళ్ళలో రోగ కారకాలు నశిస్తున్నట్టు తెలుస్తోంది.తులసి కలిపిన నీళ్ళలోని 'ఫ్లోరైడ్' గాఢతను కూడా తగ్గిస్తున్నట్టు పరిశోధనలు తెలియచేస్తున్నాయి.నీళ్ళలో తులసి ఆకులు వేసి మరగించి తాగవచ్చు ఇది ఆరోగ్యప్రధాయిని. దేవాలయాలలో తులసి తీర్థం ఇవ్వడంలో పరమార్థం ఇదే. రోజూ సేవిస్తే వత్తిడి తగ్గుతుంది.దగ్గుకు ఎంతో మంచిది.ఇప్పుడు టీలో తులసి కలపి అమ్ముతున్నారు.నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది.
       తులసి కాన్సర్ రోగులకి ఎంతో మేలు చేస్తుంది.కాన్సర్ రోగులు తీసుకునే కెమో థెరపీ వలన సంభవించే దుష్పరిమాణాలు ఇది ఎదుర్కొంటుంది.లివర్ను కాపాడుతుంది.తులసి టీ తిగాక నీటిని బాగా పుక్కిలించి ఉమ్మేయాలి.లేక పోతే పండ్లు పాడయ్యే అవకాశం ఉంది.అమెరికాకు    చెందినవేనె(wayne)విశ్వవిద్యాలయం, అలహా బాద్ కుచెందినఅగ్రికల్చర్ ఇన్స్ట్యూట్ పరిశోధనల్లో తులసికిఉన్న కాన్సర్ నివారణ గుణాలు నిర్ధారించబడ్డాయి!ఆస్త్మా ,బ్రాంఖైటిస్లో కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది.
        ఇటలీ దేశంలో అనేక వంటకాల్లో తులసిని వాడుతున్నారు. తులసి జాతికే చెందిన సబ్జ గింజలను శీతల పానీయాల్లో వాడటం తెలిసిందే కదా!
      తులసి పెంచడం చాలా సులభం. మనదేశంలో  95 శాతం ఇళ్ళలో తులసిని పెంచుతున్నారు.కీటకం కుడితే తులసి పేస్టు ఉపయుక్తంగా ఉంటుంది.అనేక చర్మ రోగాలకు కూడా వాడుతున్నారు.సౌందర్య సాధనాలలో కూడా వాడుతున్నారు.
        ఇన్ని మంచి గుణాలున్న తులసి ని ఏ రూపంలో అయినా తీసుకోండి ఈ కరోనా కాలంలో ఇది ఎంతో ఉపయోగం.
               *******      *******

కామెంట్‌లు