రాజభాష-జనభాష;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
  సెప్టెంబర్ 14 హిందీ దివస్
శుభాకాంక్షలు అందిస్తూ.
===================
బాల పంచ పదులు
=============
1. బతకడానికి శ్వాసించాలి!
    ఎదగడానికి భాషించాలి!
    రాజ భాషలో ఎదగాలి!
    దేశమంతా తిరగాలి!
    భాష,
       మనిషి వెన్నెముక రామా!
2. హిందీ సరళమైన భాష!
   అత్యధిక జనాభా భాష!
    దేశానికి అధికార భాష!
   స్వాతంత్ర్య సమరాన,
                        జనఘోష!
  భాష ,
      మనిషి వెన్నెముక రామా!
3. అమ్మభాష అప్రయత్నం!
    పరభాష మహాయత్నం!
   హిందీ భాష స్వల్పయత్నం!
   భారతీయుల బంధ సూత్రం!
   భాష ,
      మనిషి వెన్నెముక రామా!
4. హిందీ నిత్యం వినాలి!
    హిందీ స్పష్టంగా అనాలి!
    హిందీ సరిగా చదవాలి!
    హిందీ ,
    తప్పు లేకుండా రాయాలి!
    భాష ,
    మనిషి వెన్నెముక రామా!
5. హిందీ సాహిత్యం అపారం!
    తులసీదాస్ రామదర్శనం!
   సూరదాస్ సాహిత్యసాగరం! 
   కబీర్ దాస్ జ్ఞానమందిరం!
   భాష ,
   మనిషి వెన్నెముక రామా!
6. హిందూదేశవాసి,
                           హిందీభాషి!   
    హిందీ నేరిస్తే,
                        ఎంతో ఖుషీ!
    హిందీ జ్ఞానం,
                    ఇస్తుంది నగిషీ!
     నేర్చుకో,
     కూడదు ఎన్నడూ నామోషి!
_________
.

కామెంట్‌లు